📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

flight ticket prices : భారత్ నుంచి అమెరికాకు చార్జీల్లో అనూహ్య తగ్గుదల

Author Icon By Divya Vani M
Updated: April 20, 2025 • 8:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వేసవి వచ్చిందంటే చాలు… విదేశీ ప్రయాణాలకి డిమాండ్ పెరుగుతుంది.అమెరికా వెళ్లే వారికి టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి.కానీ ఈ సీజన్ మాత్రం అదృష్టాన్ని తెచ్చిందనే చెప్పాలి.ఈసారి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.ముంబై నుంచి అమెరికా వెళ్లే విమాన ధరలు భారీగా తగ్గిపోయాయి.గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసవిలో టికెట్ ధరలు తక్కువగా ఉండడం విశేషం.విడుదలైన తాజా టికెట్ రేట్స్ చూస్తే ఆశ్చర్యమే కలుగుతుంది.మే నెలలో ముంబై నుంచి న్యూయార్క్‌కు వన్ వే టికెట్ కేవలం రూ. 37,000కు లభిస్తోంది.ఇది గతేడాది కంటే చాలా తక్కువ.ఇక రిటర్న్ టికెట్ల విషయంలోనూ మాంచి డీల్స్ దొరుకుతున్నాయి. మధ్యప్రాచ్యంలో లాంగ్ లేఓవర్ ఉన్న విమానానికి ధర రూ.76,000 నుంచే ప్రారంభమవుతోంది.ఇక తక్కువ విరామ సమయంతో వచ్చే కనెక్షన్‌ ఫ్లైట్‌ టికెట్ల ధరలు రూ.85,000లోపే లభిస్తున్నాయి.ఏకంగా రూ. లక్షలోపే ప్యాకేజీ మొత్తం ఖర్చు అవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు మరింత స్థిరంగా మారుతున్నాయి.ముఖ్యంగా అమెరికా ఎయిర్‌లైన్ కంపెనీలు కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నాయి. డిమాండ్ తగ్గడం, విమానాల లభ్యత పెరగడం టికెట్ ధరలపై ప్రభావం చూపింది.కరోనా అనంతరం మారిన ప్రయాణ ట్రెండ్‌లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గతంలో పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అమెరికా వైపు కొన్ని సర్వీసులు తక్కువవ్వడంతో పోటీ తగ్గింది.

flight ticket prices భారత్ నుంచి అమెరికాకు చార్జీల్లో అనూహ్య తగ్గుదల

కానీ ఈసారి కొన్ని ఎయిర్‌లైన్స్ మరిన్ని ఫ్లైట్లు పెంచాయి. దీంతో ప్రయాణికులకు మరింత అనుకూలంగా మారింది.థామస్ కుక్ (ఇండియా), ఎస్‌ఓటీసి ట్రావెల్ సంస్థలు తెలిపిన ప్రకారం… ఈ వేసవిలో విమాన చార్జీలు 5-8 శాతం తగ్గాయి. గత ఏడాది ముంబై నుంచి న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ వంటి నగరాలకు సగటు ధర రూ. 1.25 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు అదే ప్రయాణానికి రూ. 1.15 లక్షల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవడం మంచిది. లాస్ట్ మినిట్ బుకింగ్‌కు మారితే ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. కనీసం నాలుగు వారాల ముందే టికెట్ బుక్ చేస్తే మంచి డీల్ దొరుకుతుంది.ఇంత చౌకగా అమెరికా ట్రిప్ కోసం ఇదే బెస్ట్ టైం. టికెట్ ధరలు ఈ స్థాయిలో తగ్గడం అరుదే. ఎప్పటికైనా అమెరికా వెళ్లాలని అనుకుంటే… ఇక ఆలస్యం చేయకండి.

Read Also : Donald Trump : ట్రంప్‌ కు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు : వలసదారులు

Best Time to Book USA Flights Cheap Flights from India to USA Discounted Airfare to America Flight Fare Drop India to USA International Travel Offers 2025 Mumbai to New York Flight Fare Summer Travel Deals 2025 USA Flight Ticket Price 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.