📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

కర్నూలుకు ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్

Author Icon By sumalatha chinthakayala
Updated: January 20, 2025 • 6:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు : దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ సంతానోత్పత్తి సంరక్షణ నెట్‌వర్క్ గా గుర్తింపు పొందిన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, కర్నూలులో తమ అధునాతన సౌకర్యాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతదేశంలో దాదాపు 10-15% జంటలను సంతానలేమి ప్రభావితం చేస్తుందని అంచనా. అంటే, సుమారుగా ఇది దేశవ్యాప్తంగా 30 మిలియన్ల జంటలపై ప్రభావం చూపుతున్నట్లుగా చూడాల్సి ఉంది. అందుబాటులో ఉండే ప్రత్యేక సంతానోత్పత్తి సంరక్షణ అవసరం ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఉంది. కర్నూలు లో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రం ఈ ప్రాంతంలో సంతానోత్పత్తి చికిత్సను పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉంది, వినూత్న సాంకేతికతలతో ప్రపంచ స్థాయి సంరక్షణను అందించనుంది.

అధిక-నాణ్యత కలిగిన చికిత్సలను అందించాలనే తన మిషన్‌ను ఫెర్టీ9 కొనసాగిస్తోంది, దాదాపు 70% ఐవిఎఫ్ విజయశాతం కలిగిన ఫెర్టీ9 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అంతటా 20,000 మంది విజయవంతంగా గర్భం దాల్చటంలో సహాయ పడింది. కర్నూలు కేంద్రం ఐయుఐ, ఐవిఎఫ్, ఐసిఎస్ఐ, బ్లాస్టోసిస్ట్ కల్చర్ , PICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ మరియు జెనెటిక్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌లతో సహా సమగ్ర సంతానోత్పత్తి చికిత్సల ను అందిస్తుంది. ఒకే చోట నాలుగు అద్భుతమైన సాంకేతికతలను అందిస్తోన్న భారతదేశంలోని ఏకైక సంతానోత్పత్తి బ్రాండ్, ఫెర్టీ9. ఇప్పుడు కర్నూలులోని కుటుంబాలకు ఇది చెరువులోకి వచ్చింది. ఈ పురోగతులు సంతానోత్పత్తి చికిత్సలలో అసమానమైన ఖచ్చితత్వం, భద్రత మరియు విజయాన్ని నిర్ధారిస్తాయి.

ఈ సాటిలేని సాంకేతికత కలయిక సంతానోత్పత్తి సంరక్షణలో కొత్త ప్రమాణాలను నిర్దేశించటంలో ఫెర్టీ9 యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. మాతృత్వంకు వారి ప్రయాణంలో జంటలను శక్తివంతం చేస్తుంది. ఫెర్టీ9 కర్నూల్‌లోని ఐవిఎఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సుశ్రుత మాట్లాడుతూ.. “కర్నూల్‌లోని ప్రతి కుటుంబానికి అధునాతన సంతానోత్పత్తి సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు లోతైన సానుభూతితో కూడిన విధానాన్ని ఉపయోగించడం ద్వారా, మేము జంటలను ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేలా చేయడం మరియు తల్లిదండ్రులుగా మారాలనే వారి కలను సాకారం చేసుకునేందుకు ఉత్తమ అవకాశాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కేంద్రం తమ కుటుంబాలను నిర్మించుకోవాలనుకునే వారికి ఆశలు మరియు కొత్త ప్రారంభాలకు నిదర్శనం..” అని అన్నారు.

ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి మాట్లాడుతూ.. “ఫెర్టీ9 వద్ద , ప్రతి వ్యక్తి అసాధారణమైన సంతానోత్పత్తి సంరక్షణకు అర్హులు అనే నమ్మకంతో మేము నడపబడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా కుటుంబాలను ఆదుకునే మా మిషన్‌లో మరో మైలురాయిని కర్నూలు కేంద్రం సూచిస్తుంది, వినూత్న పరిష్కారాలను మరియు కారుణ్య సంరక్షణను ఇంటికి చేరువ చేస్తుంది. సాటిలేని సాంకేతికత మరియు శ్రేష్ఠత పట్ల మా నిబద్ధతతో, మేము కేవలం కుటుంబాలను నిర్మించడం మాత్రమే కాదు; మేము భవిష్యత్తును రూపొందిస్తున్నాము” అని అన్నారు.

కర్నూలు లో సంతానోత్పత్తి సంరక్షణ కోసం పెరుగుతున్న డిమాండ్‌ అవసరాలను తీరుస్తూ, ఈ కొత్త సదుపాయం తమ ఇంటి కి చేరువలోనే అత్యాధునిక సాంకేతికతలు మరియు చికిత్సలను పొందేలా చేస్తుంది. నైపుణ్యం కలిగిన సంతానోత్పత్తి నిపుణులు మరియు సలహాదారుల బృందం మద్దతుతో, ఈ కేంద్రం సంపూర్ణమైన మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందిస్తుంది, ప్రతి రోగికి వారి మాతృత్వ ప్రయాణంలో విజయవంతం కావడానికి అవసరమైన మద్దతును అందిస్తుంది.

Ferty9 highest standard of fertility kurnool

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.