📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Fastag: ఫాస్టాగ్‌ను కరెక్ట్‌గా వాడని వాహనదారులపై కఠిన చర్యలు.. కేంద్రం

Author Icon By Sudha
Updated: July 12, 2025 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లూజ్ ఫాస్టాగ్ (Loose Fastag)డేవారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇకపై ఆ ఫాస్టాగ్‌ (Fastag) ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. లూజ్ ఫాస్టాగ్స్ వల్ల టోల్ గేట్ల దగ్గర రద్దీ పెరుగుతుండడంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. లూజ్ ఫాస్టాగ్‌లను వాడేవారిని గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని టోల్ వసూల్ సంస్థలను ఆదేశించింది.

కీలక నిర్ణయం

నేషనల్ హైవేలపై ప్రయాణించాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే. టోల్ ఫీజ్ కట్టకుండా జర్నీ చేయడం కష్టం. అయితే గతంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కేంద్రం ఫాస్టాగ్ (Fastag)ఆప్షన్ తీసుకొచ్చింది. ఫాస్టాగ్ ఉంటే చాలు.. టోల్ గేట్ల దగ్గర ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేకుండా రయ్ మని వెళ్లొచ్చు. ఆ తర్వాత ఫాస్టాగ్ స్కీమ్‌లో ‌కేంద్రం ఎన్నో మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ను కరెక్ట్‌గా వాడని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్‌ (Fastag)లను వాహనాలపై అతికించడం లేదు. టోల్ గేట్స్ వచ్చినప్పుడు లోపలి నుంచి తీసి చూపిస్తున్నారు. దీనివల్ల రద్దీ పెరుగుతుందనే ఫిర్యాదులు అందడంతో కేంద్రం చర్యలు చేపట్టింది. లూజ్ ఫాస్టాగ్‌లను ఇకపై బ్లాక్ లిస్ట్‌లో పెట్టనుంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Fastag: ఫాస్టాగ్‌ను కరెక్ట్‌గా వాడని వాహనదారులపై కఠిన చర్యలు.. కేంద్రం

ఫాస్టాగ్‌ను బ్లాక్ లిస్ట్‌

లూజ్ ఫాస్టాగ్‌లను వాడేవారిని గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని టోల్ వసూల్ సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా కేంద్రం వారి ఫాస్టాగ్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. అంతేకాకుండా విండ్ షీల్డ్‌పై ఫాస్టాగ్ అతికించని వాహనాల నుంచి డబుల్ టోల్ వసూల్ చేయనుంది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ పెట్టకపోతే స్కానింగ్ సమస్యలు వస్తున్నాయని.. దీనివల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ పెరిగి ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం తెలిపింది. దీనికి చెక్ పెట్టేందుకే లూజ్ ఫాస్టాగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని వల్ల ప్రయాణికుల టైమ్ కూడా సేవ్ అవుతుందని చెప్పింది. అంతేకాకుండా త్వరలో అందుబాటులోకి రానున్న ఆన్యువల్ పాస్ వ్యవస్థ, మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వంటి స్కీమ్స్ దృష్ట్యా ఫాస్టాగ్ ప్రామాణికత, వ్యవస్థపై నమ్మకం పెంచడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ఏదిఏమైనా నిబంధనలు ఉల్లంఘించే వారిని ఇకపై సహించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఫాస్టాగ్ అంటే ఏమిటి మరియు ఇది ఎలా పనిచేస్తుంది?

వాహనం కదులుతున్నప్పుడు నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగించే పరికరం FASTag. వాహనం యొక్క విండ్‌స్క్రీన్‌పై FASTag (RFID ట్యాగ్) అతికించబడి ఉంటుంది మరియు కస్టమర్ FASTagకి అనుసంధానించబడిన ఖాతా నుండి నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది.

భారతదేశంలో FASTagను ఎవరు కనుగొన్నారు?

భారతదేశంలో FASTagను నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) కార్యక్రమంలో భాగంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కూడా దీని అమలు మరియు అమలులో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

ఫాస్టాగ్ యజమాని ఎవరు?

FASTag అనేది భారతదేశంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహించే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థ. ఇది ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతా నుండి లేదా టోల్ యజమాని నుండి నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు భారీ షాక్..

Breaking News Central Government FASTag India News latest news Penalties TeluguNews Transport Rules Vehicle Owners

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.