Endowment Department: హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎండోమెంట్ భూముల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మాణాత్మ చర్యలు తీసుకుందని రాష్ట్ర దేవాదాయశాఖ పేర్కొన్నది. ఇప్పటి వరకు 1,817.01 ఎకరాల భూమని స్వాధీనం చేసుకున్నటు ఈ శాఖ ప్రకటించింది. ఎండోమెంట్ భూముల (Endowment Department) రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకొని అక్కడి సలంలో బోరులు ఏర్పాటు చేసినటు తెలిపింది. సంబంధిత ఆలయానికి చెందినది అంటూ సమగ్ర వివరాలు వెలడించామని తెలిపింది. వివాదాల నేపథ్యంలో రెవెన్యూ శాఖ పరిధిలో, కోరు పరిధిలో కొనసాగుతున్న కేసులతో పోరాడి 560.23 ఎకరాల భూమిని స్వాదీనం చేసుకున్నామని, వీటికి సంబంధించిన తీర్చలు తమకు అనుకూలంగా వచ్చాయని, రక్షణ చర్యలో భాగంగా రెవెన్యూ, సర్వే అధికారుల సమన్వయంతో సర్వే నిర్వహించి కంచె వేసి సరిహద్దులు గుర్తించామని అధికారులు తెలిపారు. సాగు చేయలేని ఖాళీ భూములను రక్షించేందుకు ఆలయానికి ఆదాయ వనరులను ఉత్పత్తి చేయడానికి సోలార్ పవర్ ప్లాంట్ల (Solar power plants) ఏర్పాటుకు ఐదు జిల్లాలో 231.05 ఎకరాల భూమిని గుర్తించామన్నారు.
ఎండోమెంట్ భూముల జియోట్యాగింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం
మహిళా స్వయం సహాయక బృందాలకు, టిజి రెడ్కోద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం గుర్తించిన 231.05 ఎకరాలు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఎండోమెంట్ భూముల జియోట్యాగింగ్ (Geotagging) అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. జిఐఎస్ ఉపయోగించి ఎండోమెంట్ ఆస్తుల జాబితా, వాటికి సంబంధించిన మ్యాప్ లను రూపొందించామన్నారు. ఎండోమెంట్ భూముల డిజిటలైజేషన్ చేసినట్లు పేర్కొన్నారు. రక్షణ కోసం రాష్ట్రంలోని ఎండోమెంట్ భూములు, ఇతర ఆస్తుల వివరాలను డిజిటల్ డేటా బేస్లో పొందు పరిచినట్లు వివరించారు. చాలా ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్ లు లేకపోవడంతో టిజిఆర్ఎసి దగ్గర అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల ద్వారా సమాచారం సేకరించి జియో ట్యాగింగ్ అనుసంధానం చేశామన్నారు. దేవాదాయ శాఖకు చెందిన 91,827.35 ఎకరాల భూమికి, ఇప్పటి వరకు 34,092.00 ఎకరాలకు జియోట్యాగ్ చేసినట్టు చెప్పారు.
భారతదేశంలో ఎండోమెంట్ బోర్డు ఏమిటి?
చివరగా, 1927 లో హిందూ మత మరియు ధర్మాదాయ మండలి ఏర్పాటు చేయబడింది. ఆలయ పరిపాలనను నియంత్రించే మరియు పర్యవేక్షించే అధికారం ఈ బోర్డుకు ఇవ్వబడింది. అదేవిధంగా, సరైన పరిపాలన కోసం దేవాలయాలకు అధికారులను నియమించే అధికారం కూడా బోర్డుకు ఇవ్వబడింది.
Read hindi News: hindi.vaartha.com
Read also: