📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Musk: ఒక్క ప్రకటనతో రూ. 1.31 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన ఎలాన్ మస్క్

Author Icon By Vanipushpa
Updated: July 8, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.(Donald Trump).టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదాల మధ్య కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నాడు.ఈ ప్రకటన స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్ల(Tesla Company Shares)పై భారీ ప్రభావాన్ని చూపింది. గత 24 గంటల్లో మస్క్ టెస్లా స్టాక్ క్రాష్ కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాలను చవిచూశాడు.

మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ లో క్లూ

ట్రంప్ తో వివాదం తర్వాత గత కొన్ని రోజులుగా ఎలోన్ మస్క్ నికర విలువ నిరంతరం తగ్గుతూ వస్తోంది. కాగా ఇటీవల “అమెరికా పార్టీ” అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపిన సంగతి విదితమే. మస్క్ తాజా ప్రకటన ప్రకారం వచ్చే 12 నెలల్లో అమెరికా హౌస్, సెనేట్ స్థానాల పోటీ కోసం ఆయన కొత్త పార్టీ పనిచేయనుంది. తర్వాత వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కూడా పోటీ చేయవచ్చనే క్లూని కూడా మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఆయన పార్టీపై ఎటువంటి అధికారిక వివరాలు ఇవ్వలేదు.

Musk: ఒక్క ప్రకటనతో రూ. 1.31 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన ఎలాన్ మస్క్

24 గంటల్లో 15.3 బిలియన్ డాలర్లు తగ్గింది
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని నవీకరించబడిన డేటాను పరిశీలిస్తే.. ఎలోన్ మస్క్ సంపద కేవలం 24 గంటల్లో 15.3 బిలియన్ డాలర్లు తగ్గింది. దీని తర్వాత, అతని నికర విలువ 346 బిలియన్ డాలర్లకు (ఎలోన్ మస్క్ నెట్‌వర్త్ ఫాల్) పడిపోయింది. ఈ తాజా పతనంతో 2025 సంవత్సరంలో మస్క్ నష్టం 86.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ వార్తలతో టెస్లా ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం కూడా అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. టెస్లా షేర్లు ఇప్పటికే ఈ ఏడాది 27% మేర తగ్గాయి.

కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

మస్క్ ఇటీవల టెస్లా ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో కంపెనీపై ఎక్కువ సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వంలో తన పాత్ర ముగిసిన తరువాత టెస్లాపై పూర్తిగా దృష్టి పెడతానని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఇచ్చి భిన్నమైన సందేశాన్ని ఇస్తున్నారు. ఎలోన్ మస్క్ నికర విలువ తగ్గడానికి అతని ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌లో మార్పు కూడా కారణమని చెప్పవచ్చు.మస్క్ తన రాజకీయ ప్రవేశం తర్వాత కూడా అదే విధంగా తన వ్యాపారంపై దృష్టి పెట్టగలరా అని కంపెనీ పెట్టుబడిదారులు ఆశ్చర్యపోతున్నారు. ఈ చెదిరిన సెంటిమెంట్ యొక్క ప్రత్యక్ష ప్రభావం టెస్లా షేర్లపై కూడా కనిపించింది గత ట్రేడింగ్ రోజున టెస్లా షేర్లు పతనం కావడంతో అమెరికా స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. .

ఎలోన్ మస్క్ ఎలా ధనవంతుడు అయ్యాడు?
ఎలోన్ మస్క్ ఎవరు?
ఎలోన్ మస్క్ సంపద ప్రధానంగా టెస్లా మరియు స్పేస్‌ఎక్స్‌లలో అతని యాజమాన్యం నుండి వచ్చింది, పేపాల్ మరియు జిప్2 వంటి మునుపటి వెంచర్‌ల నుండి లాభాలతో పాటు.
ఎలోన్ మస్క్ ఎందుకు ప్రసిద్ధి చెందాడు?
ఐరన్ మ్యాన్‌కు ప్రపంచానికి అత్యంత సన్నిహితుడైన ఎలోన్ మస్క్, ప్రపంచాన్ని మరియు మానవాళిని మార్చాలనే తన దార్శనికతకు ప్రసిద్ధి చెందాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

#telugu News Elon Musk announcement impact Elon Musk financial news Elon Musk net worth loss Elon Musk wealth crash Tesla share fall Tesla stock drop

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.