📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Elon Musk : యాపిల్‌పై ఎలాన్ మస్క్ తీవ్రహెచ్చరికలు

Author Icon By Pooja
Updated: August 12, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Elon Musk : టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ AI ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, టెక్ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మంగళవారం న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. యాపిల్ తన యాప్ స్టోర్‌లో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతికంగా కొమ్ముకాస్తోందని, ఇది తమ సొంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ ఎదుగుదలను అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

చట్ట పరమైన చర్యలు

యాపిల్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల, ఓపెన్ఏఐ తప్ప మరే ఇతర ఏఐ కంపెనీ యాప్ స్టోర్‌లో నంబర్ వ‌న్‌ స్థానానికి చేరుకోవడం అసాధ్యంగా మారింది. ఇది స్పష్టంగా యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించడమే. దీనిపై ఎక్స్‌ఏఐ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది” అని మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 

మరో పోస్టులో, “దురదృష్టవశాత్తు మాకు వేరే మార్గం లేదు. యాపిల్ ఈ విషయంలో చిన్నపాటి పక్షపాతం చూపడం లేదు, ఏకంగా వాళ్ల బరువునంతా మోసింది” అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

60 నుంచి 2వ స్థానానికి ఎగబాకిన గ్రాక్ ర్యాంకు

ఎలాన్ మస్క్‌ (Elon Musk) కు చెందిన ఎక్స్‌ఏఐ రూపొందించిన ‘గ్రాక్’ (Grok), ఓపెన్ఏఐకి చెందిన ‘చాట్‌జీపీటీ’ మధ్య పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఈ ఆరోపణలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలో ఎక్స్‌ఏఐ ‘గ్రాక్ 4’ను విడుదల చేసింది. ఇమేజ్, వీడియో జనరేషన్ కోసం ‘గ్రాక్ ఇమేజిన్’ వంటి కొత్త ఫీచర్లను కూడా జోడించింది. దీంతో యాపిల్ ప్రొడక్టివిటీ కేటగిరీలో గ్రాక్ ర్యాంకు 60 నుంచి 2వ స్థానానికి ఎగబాకింది.

అయితే, చాట్‌జీపీటీ గత ఏడాది కాలంగా యాపిల్ యాప్ స్టోర్ ఓవరాల్ చార్టుల్లో మొదటి లేదా రెండవ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. యాపిల్ తన యాప్ స్టోర్ ఎడిటోరియల్ కంటెంట్‌లో చాట్‌జీపీటీని ప్రత్యేకంగా హైలైట్ చేయడం, సిరి, రైటింగ్ టూల్స్‌లో ఓపెన్ఏఐ టెక్నాలజీని విలీనం చేయడమే దీనికి కారణమని మస్క్ ఆరోపిస్తున్నారు. 

ఎలోన్ మస్క్ ఏ రకమైన వ్యాపారం?

ఎలోన్ మస్క్ ఒక వ్యాపారవేత్త, ప్రధానంగా ఆటోమోటివ్ కంపెనీ టెస్లా, ఇంక్.మరియు స్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌లో ప్రముఖ పాత్రలకు పేరుగాంచాడు. మస్క్ టెక్నాలజీ కంపెనీ ఎక్స్ కార్ప్ యాజమాన్యానికి కూడా ప్రసిద్ది చెందాడు.

ఎలోన్ మస్క్ జీతం

ఎలోన్ మస్క్ (ఎంట్రీపెనర్ – టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్ – యునైటెడ్ స్టేట్స్) సంవత్సరానికి ₹1,28,95,97,70,32,443.00 జీతం సంపాదిస్తారు.

Read also hindivaartha.com

Read more ::

https://vaartha.com/workers-welfare-the-aim-of-the-coalition-government-is-the-safety-and-welfare-of-workers-minister-subhash/andhra-pradesh/529339/

Apple ChatGPT Elon musk Google News in Telugu Grok OpenAI Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.