2025 జూన్‌లో విద్యుత్ మోటార్ (Electric vehicles)కార్ల విక్రయాలు భారీగా పెరిగాయని, ఇదే నెలలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల(ఐసీఈ)తో నడిచే సంప్రదాయ కార్ల విక్రయాలు తగ్గాయని శ్రీరామ్ ఫైనాన్స్ మొబిలిటీ నివేదిక వెల్లడించింది.
ఐసీఈ కార్ల డిమాండ్ తగ్గుదల
ఐసీఈ (ICE)కార్లకు వినియోగదార్ల నుంచి గిరాకీ తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. ప్రైవేటు రంగంలో నియామకాలు పెరగడంతో జూన్‌లో ట్రక్కుల (trucks) అద్దెలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది. అయితే 18 టన్నుల పేలోడ్‌తో నడిచే ట్రక్కుల రౌండ్-ట్రిప్ (పోనూరానూ) అద్దెలు దిల్లీ-ముంబయి-దిల్లీ, దిల్లీ-హైదరాబాద్-దిల్లీ మధ్య పెరిగాయని నివేదిక వివరించింది. 2024 జూన్‌తో పోలిస్తే గత నెలలో ట్రక్కు అద్దెలు 5 శాతం మేర పెరిగాయని తెలిపింది. 2024 మే నెలతో పోలిస్తే 2025 మే నెలలో 1.3 శాతం అద్దెలు పెరిగాయని పేర్కొంది.
ద్విచక్ర వాహనాల మార్కెట్ వృద్ధి
విద్యుత్ ద్విచక్ర వాహనాల విక్రయాలు (Electric vehicles) నెలవారీగా 2025 జూన్‌లో 5 శాతం పెరిగి 93,872కు చేరాయి. విద్యుత్ మోటార్ కార్ల విక్రయాలు (Electric vehicles)2024 జూన్‌లో నమోదైన 717 నుంచి 1,267 శాతం వృద్ధితో గత నెలలో 9,804కు చేరడం గమనార్హం. నెలవారీగా చూస్తే మేలో 9,693 కాగా, జూన్‌లో 1 శాతం వృద్ధితో 9,804కు చేరాయి.
ద్విచక్ర వాహనాల మార్కెట్ వృద్ధి
ఇంధన వినియోగంలో పెట్రోల్ వినియోగం 2025 జూన్‌లో 6.4 శాతం పెరిగి 3.51 మిలియన్ టన్నులకు చేరింది. 2024 జూన్‌లో ఇది 3.30 మి.టన్నులుగా నమోదైంది. డీజిల్ వినియోగం 7.98 మి.టన్నుల నుంచి 8.08 మి.టన్నులకు పెరిగింది.
Read hindi news: hindi.vaartha.com