📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: Anil:రిలయన్స్ అధికారిని అరెస్ట్ చేసిన ఈడీ..షాక్ లో అనిల్ అంబానీ

Author Icon By Vanipushpa
Updated: October 11, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ(Anil Ambani) కి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ పవర్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అశోక్ కుమార్ పాల్‌ను శనివారం అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

India:భవిష్యత్తులో భారతదేశం అంతరిక్షంలో నంబర్ వన్గా ఉండాలి

Anil: రిలయన్స్ అధికారిని అరెస్ట్ చేసిన ఈడీ..షాక్ లో అనిల్ అంబానీ

ఫేక్ ఈమెయిల్ డొమైన్లను సృష్టించారు

గత ఏడేళ్లుగా రిలయన్స్ పవర్‌లో సీఎఫ్‌వోగా పనిచేస్తున్న అశోక్ పాల్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)కి రూ.68 కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారని ఈడీ ఆరోపించింది. ఈ నకిలీ గ్యారెంటీలను నిజమైనవిగా నమ్మించేందుకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి ప్రముఖ బ్యాంకుల పేర్లను పోలిన ఫేక్ ఈమెయిల్ డొమైన్లను సృష్టించి ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో అసలు ఉనికిలోనే లేని ఓ విదేశీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా గ్యారెంటీ పత్రాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మోసంలో ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడ్‌లింక్ అనే చిన్న కంపెనీ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

ఈడీ విస్తృత దర్యాప్తు

అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను దారి మళ్లించాయన్న ఆరోపణలపై ఈడీ ఇప్పటికే విస్తృత దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా యస్ బ్యాంక్ నుంచి పొందిన రూ.3,000 కోట్ల రుణం, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన రూ.14,000 కోట్ల మోసంపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఈడీ అధికారులు అనిల్ అంబానీని కూడా విచారించిన విషయం తెలిసిందే.

అన్న కొట్టిన ఆ ఒక్క దెబ్బే కొంపలు ముంచింది

అనిల్ అంబానీ..ఈ పేరు ఒకప్పుడు టెలికం మార్కెట్లో సంచలనం.. రిలయన్స్ CDMA టెక్నాలజీ ఫోన్ తో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన టెక్ నేత. నేడు మోసగాడిగా ముద్రపడిపోయాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో ఆరవస్థానంలోని నిలిచిన ఈ ధీరుడు ఇప్పుడు దివాళాతో పాతాళానికి పడిపోయాడు. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగిన అనిల్ అంబానీ ఇప్పుడు పేదవాడిగా మారిపోయాడు.

రిలయన్స్ ఇండస్ట్రీస్

ముఖేష్ అంబానీ దీనికి సారథ్యం వహిస్తున్నాడు. రిలయన్స్ కు దేశవ్యాప్తంగా ఎనర్జీ, పెట్రో రసాయనాలు, వస్త్రాలు, సహజ వనరులు, రీటెయిల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేసే అనేక సంస్థలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

anil ambani corporate scandal economic offences ED Arrest financial investigation Latest News Breaking News Money Laundering Reliance official Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.