ప్రఖ్యాత ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటీ భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు డెజర్ట్ ఎక్స్ డిస్కవరీ. లాంగ్ రైడింగ్ మరియు ఆఫ్-రోడ్ ట్రిప్స్‌ను ఇష్టపడే బైక్ ప్రియుల కోసం ఈ మోడల్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇప్పటికే డెజర్ట్ ఎక్స్ మరియు డెజర్ట్ ఎక్స్ ర్యాలీ అనే రెండు మోడళ్లను డుకాటీ భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. వాటికి మిడిల్ వేరియంట్‌గా డిస్కవరీ మోడల్‌ను లాంచ్ చేసింది. ఇది రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత అడ్వాన్స్‌గా మార్చేలా రూపొందించబడింది.ఈ హై-ఎండ్ బైక్ ధర కూడా అదిరిపోయేలా ఉంది. డుకాటీ డెజర్ట్ ఎక్స్ డిస్కవరీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ రూ.21.78 లక్షలు. ఈ ధరకు తగ్గట్టుగానే ఇందులో అత్యాధునిక ఫీచర్లు అందించబడాయి. రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు 5 అంగుళాల టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్స్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ బైక్ యువతను బాగా ఆకర్షించేలా రూపొందించబడింది.
108 హెచ్‌పీ పవర్
పవర్ పరంగా చూస్తే, డుకాటీ డెజర్ట్ ఎక్స్ డిస్కవరీ రియల్ మాన్ మషీన్ అనేలా ఉంది. ఇందులో 937cc ఎల్-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఇది 108 హెచ్‌పీ పవర్, 92 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. హైవేపై వాయువేగంతో దూసుకెళ్లేందుకు ఇది సిద్ధంగా ఉంటుంది. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉండటం వల్ల హైవేలు, ఆఫ్-రోడ్ ట్రిప్స్ రెండింటికీ అనువుగా ఉంటుంది. నడుపుతున్నప్పుడు పవర్‌ఫుల్ యూనిట్ నుండి వచ్చే టార్క్ అనుభూతి అద్భుతంగా ఉంటుంది.బైక్ డిజైన్ పరంగా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో లార్జ్ విండ్‌స్క్రీన్, రేడియేటర్ గార్డ్, బెల్లీ గార్డ్ వంటి యాక్సెసరీస్ కూడా పొందవచ్చు. ట్రావెలింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినందున దీని లుక్ ఎంతో ప్రీమియంగా ఉంటుంది. ఇది వైట్, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటార్‌సైకిల్ ప్రియులకు అత్యున్నత రైడింగ్ అనుభూతిని అందించేలా రూపొందించిన ఈ బైక్, సూపర్ ప్రీమియం మోడల్‌గా భారత మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.