Social Media : సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మవద్దు – మంత్రి అనిత : వర్షాలు, వరదలపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత (Minister Vangalapudi Anitha) ప్రజలకు విజ్ఞప్తి చేసారు. భారీ వర్షాల రీత్యా అన్ని సహయక చర్యలు చేపట్టామని తెలిపారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామన్నారు. ఇందుకు అన్ని స్థాయిల అధికార యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు ఒక వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులోభాగంగా బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని.. ఈ క్రమంలోర జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ అధికారులకు సూచించారు. వర్ష ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు (Difficulties) లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక వేళ.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి కీలక సూచన చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ అధికారులకు సూచించారు. వర్ష ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక వేళ.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి కీలక సూచన చేశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. అయితే ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్, నెలకూలిన వృక్షాలను వెంటనే తొలగించాలని వారికి సూచించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,19,133 క్యూసెక్కులుగా ఉందని వివరించారు. వరద ప్రవాహం కారణంగా.. మొదటి ప్రమాద హెచ్చరిక వరకు నీరు చేరే అవకాశం ఉందన్నారు.
నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రమాద ప్రాంతాల్లో తప్పని సరిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలని సూచించారు. హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు, చెట్ల వద్ద ఉండరాదని ప్రజలకు మంత్రి అనిత సూచించారు.
మరోవైపు భారీ వర్షాలు, అల్ప పీడనం ఏర్పడిన వేళ.. సోషల్ మీడియాలోని వదంతులను నమ్మవద్దంటూ ప్రజలకు కీలక సూచన చేశారు. చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి. జయలక్ష్మి, డైరెక్టర్ ప్రఖర్ జైన్, కోస్తా జిల్లాల కలెక్టర్లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :