ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగులకు తప్పనిసరిగా అందించే సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ఉద్యోగ సమయంలో ఇంకా ఉద్యోగం మానేసాక డబ్బు అవసరమైన సమయంలో ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తుంది.
EPFO ముఖ్య ఉద్దేశ్యం రిటైర్మెంట్ సేవింగ్స్. దీనికి విత్ డ్రా నిబంధనలు కూడా ఉన్నాయి. పెళ్లి, చదువు లేదా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ముందుగానే విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగులు PF అకౌంట్స్ నుండి ముందుగానే డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఫామ్ 31ని ఉపయోగించాలి. ఈ ఫామ్ అఫీషియల్ UAN పోర్టల్‌లో ఉంటుంది.
పెళ్లి కోసం
మీ పెళ్లి లేదా వారి పిల్లల పెళ్లిళ్లకు పిఎఫ్ డబ్బు తీసుకోవచ్చు. అలాగే పెళ్ళికి సంబంధించిన ఖర్చుల కోసం పిఎఫ్ నుండి 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ PF అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు pf డబ్బు జమ తర్వాత మాత్రమే విత్ డ్రా చేయవచ్చు. పెళ్లి కోసం మూడు కంటే ఎక్కువ సార్లు డబ్బు తీసుకోలేరు. 2. చదువు కోసం : 10వ తరగతి తర్వాత పిల్లల ఉన్నత చదువు లేదా విద్యా ఖర్చుల కోసం PF మొత్తం నుండి 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి కూడా PF అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు pf జమ చేసిన తర్వాత విత్ డ్రా ఉంటుంది. అలాగే పిల్లల చదువు కోసం మూడుసార్లు కంటే ఎక్కువగా పిఎఫ్ విత్ డ్రా చేయలేరు.
Read Also: Operation Sindoor: ఉగ్రవాద క్యాంపులే లక్ష్యంగా భారత్ బాంబుల వర్షం