📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Cyber Crime:ఈ-సిమ్ పేరిట సైబర్ నేరగాళ్ల నయా మోసం

Author Icon By Pooja
Updated: August 12, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో నేరాలకు పాల్పడుతుందడ ం పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు, ఇప్పటి వరకు బహమతులు, మెట్రమోనియల్ వెబ్సైట్ లతో పాటు డిజిటల్ ఆరెస్టుల వరకు అమాయకులను బెదిరించి వారి ఖాతాలను ఖాళీ చేసి న ఈ నేరగాళ్లు తాజాగా ఈసిం మోసాలకు తెరలేపారు.

సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని బెదిరించి, ఈసింలోకి మార్పించి ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు

కొన్ని నిమిషాల పాటు సిం కార్డులను(Sim Cards) బ్లాక్ చేయడం ద్వారా తాము ఎంచుకున్న వ్యక్తుల ఖాతాలను ఖాళీ చేయడం సైబర్ నేరగాళ్ల కొత్త తరహా నేరం గా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ఇంతకు ఈ తరహా మోసం ఎలా జరుగు తుందంటే సైబర్ నేరగాళ్లు మొదట తమను తాము కస్టమర్ కేర్ ప్రతినిధులుగా చెప్పుకుంటారు. మీ సిం కార్డు సరిగ్గా

పనిచేయడం లేదని, దీనిని 24 గంటల్లో బ్లాక్ చేస్తామని మెసేజ్లు పంపుతారు. అనంతరం వెంటనే మీ సిం కార్డును ఈ సింలోకి మార్చుకొండి అంటూ కొన్ని సూచనలు చేస్తూ ఓటిపిలు అడుగడం లేదా కోడ్ను షేర్ చేసి దీనికి టిక్ చేయమని చెబుతారు. ఇంకొన్నిసార్లు మీకు ఒక లింక్ లేదా ఎపికె ఫైల్ను పంపి, దానిని డౌన్లోడ్ చేయమని కోరుతారు. దీనిని వెంటనే ఇన్స్టాల్ చేస్తే వి నియోగదారుల ఫోన్లలో వున్న ముఖ్యమైన డేటా, బ్యాంకుల ఖాతా ల వివరాలు, పాస్వర్డ్లు ఆన్నీ సైబర్ నేరగాళ్లకు తెలిసిపోతాయి. దీని తరువాత సెల్ఫోన్ వినియోగదారుల మొబైల్ నంబర్లోని ఈ సిమ్ యాక్టివేట్ చేసి, అసలు సిమ్ ను పని చేయకుండా చేస్తారు. ఈ విషయాలు తెలియని సెల్ఫోన్ వినియోగదారులు సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేయగానే

ముఖ్యమైన డేటా బ్యాంకుల ఖాతాలో నేరగాళ్లకు తెసిలిపోతాయి

క్షణాల్లో బ్యాంకుల్లోని ఖాతాలో గల డబ్బులు ఖాళీ అవుతున్నాయి. ఈ తరహా నేరాలు దేశ వ్యాప్తంగా 50 వరకు జరగగా హైదరాబాద్లో(hyderabad) ఐదు చోట్ల జరిగి నట్లు పిర్యాదులు అందాయి. ఈ తరహా నేరాల్లో సైబర్ నేరగాళ్లు మొదట సెల్ఫోన్ విని యోగదారుల ఫోన్లను తమ నియంత్రణలోకి తీసుకుంటారు. దీని తరువాత వారి బ్యాంకు ఖాతాలలోని దబ్బులను కాజేసేందుకు ఓటీపీలను వాడతారు.

కాల్స్ కి స్పందించవద్దు

కాగా ఈ తరహా మోసాలను నివారించేందుకు సెల్ ఫోన్ వినియోగదారులు ఈసిం పేరిట వచ్చే కాల్సు స్పందించవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. నిజంగానే సిం కార్డుల్లో సమస్యలు వుంటే నేరుగా నెట్ వర్క్ ప్రొవైడర్ నిర్వాహకులతో మాట్లాడలని, సెల్ఫోన్లకు ఆపరిచితుల నుంచి వచ్చే ఓటిపిలకు స్పందించవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కోరుతున్నారు. ఇక టెలికాం సంస్థలు తమ ఖాతాదారులను ఇలాంటి ప్రశ్నలు వేయదని, మెసేజ్ లు, యాప్లు ప లిపి డౌన్లోడ్ చేసుకోమని కోరదని వారంటు న్నారు. ఒకవేళ నిజంగానే సిం కార్డులు పనిచేయకుంటే సంబంధిత కంపెనీల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిం చుకోవాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా అనుమానం వచ్చినా మోసం జరిగినట్లు అనిపిం చినా వెంటనే సంబంధిత కంపెనీ ప్రొవైడ ర్లకు ఫిర్యాదు చేయాలని లేదా సంచార్ సాథ్ పోర్టలు కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతు న్నారు. దీంతో పాటు 1930కు కూడా ఫిర్యాదు చేయవచ్చని వారు తెలిపారు.

ఈ-సిమ్ మోసం అంటే ఏమిటి?

సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటిస్తూ, మీ సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని బెదిరిస్తారు. ఆ తర్వాత, సిమ్‌ను ఈ-సిమ్‌లోకి మార్చుకోవాలని చెప్పి, ఓటీపీ లేదా ప్రత్యేక కోడ్‌ను పంచుకోవాల్సిందిగా అడుగుతారు. ఈ విధంగా మీ ఫోన్‌ను నియంత్రణలోకి తీసుకుని, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు.

ఈ-సిమ్ మోసాల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి?

ఈ మోసంలో చిక్కుకుంటే, మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు క్షణాల్లో ఖాళీ అవుతాయి. సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటారు.

Read more: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/son-in-law-kills-mother-in-law-mystery-solved/business

bank robery Breaking News crime stories Cyber Crime cyber security Google news latest news sim cards

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.