📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Crude price: ముడిచమురు ధరలు తగ్గే సూచనలు!

Author Icon By Shobha Rani
Updated: July 4, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది డిసెంబరుకు బ్యారెల్‌ ముడిచమురు ధర (Crude price) 60 డాలర్ల దిగువకు చేరే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ అంచనా వేసింది. ప్రస్తుతం 70 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా గిరాకీ మందకొడిగా ఉన్నా, ఉత్పత్తి పెంచాలని ఒపెక్‌+ దేశాలు నిర్ణయించడమే చమురు ధరల అదుపునకు కారణమని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ కమొడిటీ ఇన్‌సైట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రేమాశిష్‌ దాస్‌ (Premashish Das)వెల్లడించారు. ఈ ఏడాది చివరకి బ్యారెల్‌ ముడిచమురు ధర 55-60 డాలర్ల శ్రేణిలో కదలాడొచ్చని అంచనా వేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు
ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలతో పాటు భౌగోళిక ఉద్రిక్తతలు పెచ్చరిల్లినా.. ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోత ప్రకటించినా, బ్యారెల్‌ చమురు ధర (Crude price) 70-75 డాలర్లకు చేరొచ్చని హెచ్చరించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో భారత్‌లో చమురుకు గిరాకీ మెరుగ్గా ఉండొచ్చన్నారు. మన దేశ గిరాకీ రోజుకు 1.1- 1.2 లక్షల బ్యారెళ్ల మేర పెరగొచ్చని అంచనా వేశారు.

ముడిచమురు ధరలు తగ్గే సూచనలు!

దేశీయ గిరాకీ పెరుగుదల అంచనా
చమురు ధరల్లో కదలికలు ఇలా: 2022లో చమురు ధరలు (Crude price) క్షీణిస్తున్న నేపథ్యంలో, ఉత్పత్తి కోతను ఒపెక్‌+ దేశాలు ప్రారంభించాయి. నెలకు 2.2 మిలియన్‌ బ్యారెళ్ల మేర ఉత్పత్తి కోత విధిస్తూ అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ ఏడాది ఏప్రిల్‌ ప్రారంభంలో ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా బ్యారెల్‌ చమురు ధర 60 డాలర్ల దిగువకు చేరింది. తదుపరి ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలతో మళ్లీ 70 డాలర్ల వద్ద కదలాడుతోంది.
గత కాల చరిత్ర – ధరల చలనాలు
2022లో ధరలు క్షీణించడంతో 2.2 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోతను ఒపెక్+ (OPEC+)ప్రకటించింది. 2024లో ఒపెక్ ఈ కోతను తగ్గించి ఉత్పత్తి పెంచింది, అందువల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ఈ మధ్య కాలంలో చమురు ధరలు తిరిగి $70 వద్ద ట్రేడవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nse Ipo: ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ వస్తే దమానీకి భారీ లాభాలు!

Breaking News in Telugu Brent crude 60 dollars commodity market update crude oil price forecast 2024 crude oil price news Google news Google News in Telugu India oil demand growth Iran Israel oil impact Latest News in Telugu oil price today Paper Telugu News S&P crude oil prediction Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.