📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Cristiano Ronaldo: ప్రియురాలికి రొనాల్డో ఖరీదైన గిఫ్ట్..

Author Icon By Pooja
Updated: August 12, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు (Cristiano Ronaldo) తన ఎనిమిదేళ్ల ప్రేమకు శుభం కార్డు వేశాడు. తన ప్రియురాలు, స్పానిష్ మోడల్ అయిన జార్జినా రొడ్రిగ్జ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ శుభవార్తను జార్జినా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రొనాల్డో తనకు తొడిగిన అత్యంత ఖరీదైన వజ్రపుటుంగరాన్ని చూపిస్తూ ఆమె షేర్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆ ఉంగరం ధరపై పెద్ద చర్చ జరుగుతోంది.

తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన జంట

జార్జినా వేలికి ఉన్న ఈ ఉంగరం చూడటానికి చాలా పెద్దదిగా ఉంది. దీని మధ్యలో భారీ వజ్రం, దానికి ఇరువైపులా మరో రెండు చిన్న వజ్రాలు అమర్చారు. ఆభరణాల నిపుణులు ఈ ఉంగరంపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. మధ్యలో ఉన్న ప్రధాన వజ్రం సుమారు 15 నుంచి 30 క్యారెట్ల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు. దీని విలువ కనీసం 2 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.8 కోట్ల నుంచి రూ. 42 కోట్ల) వరకు ఉండొచ్చని రేర్ క్యారెట్ సీఈఓ అజయ్ ఆనంద్ తెలిపారు.

ఉంగరం దార రూ. 42 కోట్లు

ఇక‌, జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రొనాల్డోను ట్యాగ్ చేస్తూ ఒక ఉద్వేగభరితమైన క్యాప్షన్ రాశారు. “అవును, నేను ఒప్పుకుంటున్నాను. ఈ జన్మలోను, నా ప్రతి జన్మలోనూ” అంటూ తన అంగీకారాన్ని తెలిపారు. ఈ పోస్ట్ సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి చేసినట్లు జియోలొకేషన్ చూపిస్తోంది. ప్రస్తుతం రొనాల్డో అక్కడి అల్-నసర్ క్లబ్‌కు ఆడుతున్న విష‌యం తెలిసిందే.రొనాల్డో, జార్జినా 2016 నుంచి ప్రేమలో ఉన్నారు. మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో జార్జినా పనిచేస్తున్న స‌మ‌యంలో వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. 2017లో జ్యూరిచ్‌లో జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ అవార్డుల కార్యక్రమానికి తొలిసారిగా జంటగా హాజరై తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. వీరికి అలనా మార్టినా, బెల్లా ఎస్మరాల్డా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బెల్లాతో పాటు పుట్టిన కవల సోదరుడు ఏంజెల్ పుట్టిన కొద్దిసేపటికే దురదృష్టవశాత్తు మరణించాడు. రొనాల్డోకు అంతకుముందే సరోగసీ ద్వారా, ఇతర సంబంధాల ద్వారా మరో ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎంగేజ్‌మెంట్ వార్తతో వారి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ జంట‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 క్రిస్టియానో రొనాల్డో ఏ దేశానికి చెందినవాడు

పోర్చుగల్

క్రిస్టియానో రొనాల్డో ఏ ఆటలో ప్రసిద్ధి?

ఫుట్‌బాల్

42 crores girlfriend Google News in Telugu Latest News in Telugu love realationship ring ronaldo Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.