అనవసరంగా ఎక్కువ క్రెడిట్ కార్డులు(Credit cards) వినియోగించడం సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నిర్ణయించిన గడువు లోపు బిల్లులు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు, తరచూ కొత్త క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయడం వల్ల బ్యాంకులు ఆ వ్యక్తి రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాడని భావించి రిస్క్ ఎక్కువగా ఉన్న కస్టమర్‌గా పరిగణిస్తాయి. దీని కారణంగా స్కోర్ మరింత దెబ్బతింటుంది.
Read Also: SBI: ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడితే
సాధారణంగా ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులను క్రమబద్ధంగా నిర్వహించడం సులభంగా ఉంటుంది. కానీ కార్డుల సంఖ్య పెరిగే కొద్దీ బిల్లింగ్ సైకిళ్లు, గడువు తేదీలు గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. దీంతో ఆలస్య చెల్లింపులు, లేట్ ఫీజులు, అధిక వడ్డీ భారం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కలిసి ఆర్థిక క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఆర్థిక నిపుణుల ప్రకారం, ప్రతి క్రెడిట్ కార్డ్‌లోని క్రెడిట్(Credit score) లిమిట్‌ను పూర్తిగా వినియోగించకుండా, 30 శాతానికి మించకుండా ఖర్చు చేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే, ఆటో డెబిట్ సదుపాయం ఉపయోగించడం ద్వారా బిల్లులు మిస్ కాకుండా చెల్లించవచ్చు. పాత కార్డులను అవసరం లేకపోతే మూసివేయకుండా, తక్కువ వినియోగంతో కొనసాగించడం ద్వారా క్రెడిట్ హిస్టరీ బలంగా ఉంటుంది. సరైన ప్రణాళికతో కార్డులను ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడటమే కాకుండా, భవిష్యత్తులో రుణాలు సులభంగా లభిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: