ప్రస్తుతం భారతీయుల ఆర్థిక జీవితంలో క్రెడిట్ కార్డులు(Credit Card) కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం, గతేడాది ఫెస్టివ్ సీజన్‌లో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. సుమారు 42 శాతం యూజర్లు ఒక్కరికి రూ.50,000 పైగా షాపింగ్‌కు ఖర్చు చేశారు.
Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ
బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం
అయితే, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల CIBIL స్కోర్ తీవ్రంగా ప్రభావితమవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పించుకోవడానికి ఆటోమేటిక్ పేమెంట్స్ సెట్ చేయడం, జీతం అందిన వెంటనే బిల్లులను చెల్లించడం, రిమైండర్లు ఉపయోగించడం, లేదా గడువుకు ముందే పేమెంట్ చేయడం వంటి చర్యలు సహాయపడతాయని సూచిస్తున్నారు.
అయితే బిల్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించలేని పరిస్థితుల్లో కనీసం మినిమమ్ పేమెంట్ చేయడం లేదా EMIలో మార్చుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: