📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

News Telugu: CPI ఓటును కాపాడుకుందాం..సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

Author Icon By Sharanya
Updated: August 21, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుత్బుల్లాపూర్(హైదరాబాద్): అత్యంత క్లిష్టసమస్యల మధ్య దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే దేశంలో బిజెపి, మోడీల ప్రభుత్వాలకు చెరమగీతం పాడటం తప్ప మరోమార్గం లేదని సిసిఐ జాతీయ ప్రధానకార్యదర్శి అన్నారు. బుధవారం గాజుల రామారం పొట్లురి నాగేశ్వరరావునగర్లో కామ్రేడ్ బాల మల్లేశ్ హాలు(మహారాజా గార్డెన్స్)లో జరిగిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభ (CPI Telangana Fourth Congress)లకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్రతిఒక్కరికీ ఓటుహక్కు అందించడంలో ఎన్నికలకమిషన్ విఫలమైంది

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు (Everyone has the right to vote) అందించడంలో దేశంలో ఎన్నికలకమిషన్ ఘోరంగా విఫలమైందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో తటస్థ సంస్థగా నిలవాల్సిన ఎన్నికలకమిషన్ నేడు బిజెపికి, మోడీకి వత్తాసుపలికే సంస్థగా మారిందని విమర్శించారు. సిపిఐ నాలుగవ రాష్ట్రమహాసభకు అతిథిలుగా సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్. కె. నారాయణ, సయ్యద్ ఆజీజ్, సిపిఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి జాన్వెస్లీ, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు పార్టీశ్రేణులను ఉద్దేశించి సందేశాన్నిచ్చారు. మహాసభ ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఎం.డి. యూసుఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిసిఐ రాష్ట్రకార్యదర్శి ఎంఎల్ఎ కూనంనేని సాంభశివ రావు, జాతీయ కార్యవర్గసభ్యులు చాడా వెంకట్ రెడ్డి, ప్రధాన వశ్యపద్మ, సిసిఐ జాతీయసమితి సభ్యులు వల్లా వెంకట్రెడ్డి, కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహయ కార్యదర్శి తక్కెపల్లి శ్రీనివాసరావు, సిపిఐ ఎంఎల్ నెల్లకంటి సత్యం, పి.జె.చంద్రశేఖర్రావు, సినీనటుడు మాదాల రవి, ఆహ్వానసంఘ అధ్యక్షులుడి. జి. సాయిల్, కార్యదర్శి ఇ.ఉమా మహేశ్ వేదికపై ఆసీనులయ్యారు. ఓటుహక్కును 18 ఏళ్లకు సవరిచాల్సిన అవసరాన్ని గుర్తించి పోరాటాల దానిని సాధించిన ఘనత కేవలం సిపిఐ పార్టీకే దక్కుతుందన్నారు.

ఉపరాష్ట్రపతిగా సుదర్శన్రెడ్డికి మద్దతు పలకాలి:

ఎన్డీఓ కూటమి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శనరెడ్డికి సిపిఐ తమపూర్తిమద్దతు ప్రకటించిండన్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఎందుకు రాజీనామా చేశారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి రాజీనామా చేయలేదని అనేక ఇతర కారణాలు దాగి ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి గెలవకపోతే దేశంలో అనేకదేశ రాజకీయాలలోనూ తీవ్రప్రభావం చూపుతుందని అన్నారు. కార్మికులు, రైతులు, మహిళలను మరింత బలోపేతం చేయడం ద్వారా కమ్యూనిస్టుపార్టీని బలమైనపార్టీగా రూపొందించాలన్నారు. వీర తెలంగాణ గడ్డపై మతోన్మాద బిజెపి ప్రాభల్యాన్ని అడ్డుకునే శక్తి కేవలం సిపిఐకే ఉందని కందిమళ్ల ప్రతాప్రెడ్డి అన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టుల సాయుధ పోరాటాల ద్వారానే తెలంగాణ ఉధ్యమం రాజుకుందని దీనిని ప్రజల్లోకి విస్తుతంగా తీసుకువెళ్లేందుకు. పార్టీని సన్నద్ధం చేయాలని జాతీయ ప్రధానకార్యదర్శి రాజాకు విజ్ఞప్తిచేశారు. సిపిఐ రాష్ట్ర నాలుగవ మహాసభప్రారంభంనుండే కామ్రేడ్లు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రారంభసభకు సిపిఐ కార్యకర్తలు, నాయకులు ఎర్ర చీరలు, ఎర్రచొక్కాలు ధరించి పెద్దఎత్తున హాజరయ్యారు. దీనితో ప్రాంగణమంతా ఆరుణవర్ణం సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tg-high-court-ramanthapur-incident-all-responsible-key-comments/telangana/533499/

Breaking News Communist Party of India CPI CPI Election Strategy CPI National Secretary latest news Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.