📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్

Latest Telugu news : Corruption – అవినీతి పాలకులకు ఇక చెల్లుచీటీ!

Author Icon By Sudha
Updated: September 24, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచాన్ని హడల్ ఎత్తి
చాయి. ఈ సంఘటనలతో దాదాపు అన్ని దేశాధినేతలు, పాలకులు, ప్రభుత్వాలు చాలా గుణపాఠాలు
నేర్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు చాలా ఓపిక, సహనం కలిగి ఉంటారు.
ఓటు ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పత్రికలు ద్వారా, భావ ప్రకటన ద్వారా తమ తమ అభి
పాయాలను వెలిబుచ్చుతూ ఉంటారు. ఇవేమీ పట్టించుకోకుండా, అధికారం మన చేతిలో ఉంది అని మూర్ఖంగా ముందుకు పోయే ప్రభుత్వాలకు ప్రజలు ముఖ్యంగా యువత ఏ రకంగా బుద్ధి (intellect)చెబుతుందో గతంలో శ్రీలంకలో జరిగిన పరిణామాలు, తాజాగా నేపాల్లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తస్మాత్గ్ జాగ్రత్త పాలకులారా అని హెచ్చరికలు యువత ప్రత్యక్ష చర్యల ద్వారా తెలియ జేయడం జరిగింది. ఇకప్రపంచవ్యాప్తంగా పాలకులు తమ పాలనా పద్ధతులను, విధానాలు మార్చుకోవాలి. లేకపోతే తగినమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో ప్రజలు, యువత ఇంతబాహాటంగా పాలక వర్గంపై హింసాత్మక ఘటనలతో రెచ్చిపోవడానికి ప్రధాన కారణాలు ‘పాలకులఅవినీతి (Corruption), బంధుప్రీతి’ అని గ్రహించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వా లు, అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున అవినీతి,(Corruption) బంధుప్రీతికి పెద్ద పీటవేసి, ప్రజల అవసరతలు పక్కన పెట్టడంతో చివరికి విసుగు చెందిన ప్రజలు యువత ప్రత్యక్ష చర్యలకు పాల్పడి, పాలకులను పారద్రోలుతున్నారు. నిజానికి రాజకీయాల్లో వచ్చిన ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్వార్థం వదులుకుని, ప్రజలకు సేవ చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రజల అవసరతలు తీర్చాలి. వారి అభిప్రాయాలను గౌరవించి తదనుగుణంగా పాలన అందించాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజాదర్బార్ తరచూ నిర్వహిస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. కానీ నేటి పాలకులు ఎన్నికయ్యే వరుకూ ప్రజలే దేవుళ్లు అంటూ పొగిడి, ఓట్లు, సీట్లు దండుకుని తదుపరి ప్రజలకు దూరం జరగడంతో ప్రజా వ్యతిరేకత మూటకట్టు కుంటున్నారు. అవినీతి, బంధుప్రీతి భారీ స్థాయిలోచేయడం, అధికారం అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో నడవడంతో చివరికి దేశం విడిచి పారిపోయే పరిస్థితి, ప్రాణ సంకటంతో బ్రతికే పరిస్థితి తెచ్చుకోవడం జరుగుతుంది. ఇకనైనా పాలకుల స్వభావం మారాలి. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించాలి.లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Corruption – అవినీతి పాలకులకు ఇక చెల్లుచీటీ!

ప్రపంచ సర్వే సంస్థలు వెలువరించిన నివేదికల ప్రకారం ముఖ్యంగా అవినీతి (Corruption)లో శ్రీలంక 121వ స్థానం లో, బంగ్లాదేశ్ 151వ స్థానంలో, నేపాల్ 107వస్థానంలో, ఇక భారతదేశం 96వ స్థానంలో ఉంది. అనగా ఈ దేశాల్లో అవినీతి బంధుప్రీతి ఎంతగా విస్తరించి ఉందో తేటతెల్లం అవుతుంది. పాలకులు నిజ జీవితంలో ముఖ్యంగా అధికా రం చేపట్టిన తరువాత విచ్చలవిడిగా అవినీతి బంధుప్రీతితో వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేయడంతో, మోసపోయిన ప్రజలు పోరుబాటపడుతున్నారు. తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు. ఇక అన్ని దేశాలపాలకులు కళ్లు తెరవాలి. తమ పాలనను సమీక్షించుకోవాలి. పారదర్శ కంగా పరిపాలన అందించాలి. ప్రజలమన్ననలు పొందాలి. మన దేశంలో కూడా ఇటీవల కాలంలో రాజకీయ అవినీతి, బంధుప్రీతిపెచ్చుమీరుతున్నది. ప్రశ్నించే గొంతులను అణగ దొక్కాలని చూడటం జరుగుతుంది. ఇది ఏమాత్రం శ్రేయోష్కరం కాదు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకో రాదు. ప్రజల అవసరతలు పాలకులు తీర్చాలి.ఎన్నికల్లో అడ్డమైన వాగ్దానాలు ఇచ్చి, గద్దె ఎక్కిన తరువాత గళ్ళా పెట్టేలో డబ్బులు లేవు అని మోసంచేయరాదు. గత ప్రభు త్వాలు ఎంత మేరకు నిధులు నిల్వలు ఉంచారోతెలిసే కదా ఎన్నికల బరిలోనిలుస్తున్నారు. ప్రజలకు, యువతకు అనేక వాగ్దానాలు ఇచ్చి, ఓట్లు సీట్లు దండుకుని, తీరా అధికారం చేపట్టిన తరువాత డబ్బులు లేవు అని వాగ్దానాలు నెరవేర్చ కపోతే, ప్రజలకు, యువతకు ఆగ్రహం రాక ఏమోతుంది? తస్మాత్ జాగ్రత్త పాలకులారా, ప్రజా ప్రతినిధులారా ఎల్ల కాలం ప్రజలు, యువత అమాయకులు కాదు అని ఇకనైనా గ్రహించాలి. ముఖ్యంగా అవినీతి బంధుప్రీతివదులుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజాధనాన్ని వేతనాలు గా తీసుకుంటూ, కనీసం శాసనసభ సమావేశాలకు, శాసన మండలి సమావేశాలకు, పార్లమెంటు సమావేశాలకు రాకుం డా వేతనాలు తీసుకోవడం మంచిది కాదు.భవిష్యత్తులో జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. అధికారం రాలేదు అని, గెలిచిన తరువాత సమావేశాలకు రాకుండా ఉంటే ఎలా? మీ నియోజకవర్గం ప్రజల అవసరతలు ఎలా తీరు స్తారు? మీ ప్రాంతాలప్రజల సమస్యలు ఎలా పరిష్కరించ బడతాయి. ఇకనైనా ఆలోచన చేయాలి. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు, ప్రజల మనిషిగా ఉండాలి. సొంత వ్యాపారా లు పెంచుకోవడం, సొంత సంపద పెంచుకోవడం కోసం
రాజకీయ అవతారాలు ఎత్తడం సరికాదు. ఏదో ఒక సమ యంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి
ఉంటుంది అని మన ఇరుగు పొరుగు దేశాల పరిస్థితులు బట్టి తెలుస్తోంది.

Corruption – అవినీతి పాలకులకు ఇక చెల్లుచీటీ!

ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. ‘మాఎమ్మెల్యే కనుపడుట లేదు, మా ఎం.పి కనుపడుట లేదు,మాప్రజా ప్రతినిధి కనుపడుట లేదు అనే బోర్డులు దర్శనం కారాదు. మనదేశంలో కూడా ముఖ్యంగా రాజకీయవ్యవస్థ, ప్రతి నిధులు అవినీతి బంధుప్రీతితో తారాస్థాయికి చేరుకుంటుం ది. ఇకనైనా చిత్తశుద్ధితో పనిచేయాలి.పారదర్శక పాలన అందించాలి. మన భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకో వాలి. రాజ్యాంగనిర్మాతలు, స్వాతంత్ర్య సమర యోధులు ఆశయాలు లక్ష్యాలు నెరవేర్చండి. దేశంలో ఉన్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలి. నిరక్షరాస్యత, అనారోగ్యం పేదరికం కూకటివేళ్లతో పెకలించాలి. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటుచేసిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను రాజ్యాంగ బద్ధంగా పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. అదేసమయం లో ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అవినీతి బంధుప్రీతి రహితంగా విధులు నిర్వహించాలి. లేకపోతేభవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని గ్రహించాలి. ప్రజలందరికీ కనీసం కూడు,గూడు, గుడ్డ అందించే పని పాలకులు చేపట్టాలి. విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలి.నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయా లి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. వ్యవసాయ, పారిశ్రామికరంగాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి. బడ్జెట్లో అధిక నిధులు సమకూర్చాలి. అధిక ధరలు, ప్రై
వేటీకరణకు ముకుతాడు వేయాలి. సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలతో సుస్థిర అభివృద్ధి అసాధ్యం అనే వాస్తవాన్ని పాలకులు గ్రహించాలి. వికసిత భారత్ మనదేశం భవిష్యత్తులో మారాలి అంటే ముఖ్యంగా పాలకులు పారదర్శకంగా పరిపాలన అందించడంతో మాత్రమే సాధ్యం. ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా తలసరి ఆదాయం పెరుగు తుంది. జీవన ప్రమాణాలు కలిగి ఫిన్లాండ్,స్వీడన్, నార్వే వంటి దేశాలు సరసన మన భారత్ చేరుతుంది. అవినీతి బంధుప్రీతి రహిత దేశంగా,అన్నిరంగాల్లో అభివృద్ధి చెంది న దేశంగా మన పాలకులు మన దేశాన్ని తీర్చిదిద్దుతారు అని ఆశిద్దాం. ఇటీవలమన ఇరుగు పొరుగు దేశాల్లో జరుగు తున్న పరిణామాలు, అన్ని దేశాలకు కనువిప్పు కావాలి.

ఐ.ప్రసాదరావు

అవినీతి నిర్ములనకు చర్యలేవి?

ప్రభుత్వోద్యోగి అవినీతికి పాల్పడినప్పుడు, ప్రజాధనాన్ని అపహరించినప్పుడు.. ఉద్యోగం నుంచి తొలగించడం ఒక్కటే సరైన శిక్ష అని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.అవినీతి కేసుల్లో డబ్బులు కొద్ది మొత్తమా, పెద్ద మొత్తమా అనేది సమస్యే కాదని పేర్కొంది.అవినీతి ఆచూకీని అవినీతి నిరోధ‌క శాఖ‌ (ఏసీబీ)కి ఎవరైనా ఉచితంగా (టోల్‌ఫ్రీ నెంబరు) కు సమాచారం అందించవచ్చు.

లంచగొండి అంటే ఎవరు?

లంచం ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరాలుగా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం డబ్బుల రూపంలో గానీ లేదా బహుమతుల రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, ఆస్తి రూపంలో, ఓటు, లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని ‘లంచగొండి’ అంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

accountability Anti-Corruption Breaking News Governance india latest news Leadership orruption Politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.