సామాన్యుల వంటగదిలో వంట నూనె ధరలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో తక్కువ ధరకు లభించిన సన్‌ఫ్లవర్ నూనె ఇప్పుడు లీటరుకు రూ. 178 వరకు పలుకుతోంది. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెట్లలో ధరల వ్యత్యాసం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది.
Read also: Poco X8 Pro: పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!
Oil Price Hike: Cooking Oil Prices Rise Again
డిమాండ్ పెరగడం.. స్టాక్ తగ్గడం
ప్రస్తుతం మార్కెట్లో నూనెకు డిమాండ్ విపరీతంగా పెరగగా, సరఫరా మాత్రం తక్కువగా ఉంది. దీనివల్ల చాలా సూపర్ మార్కెట్లు మరియు కిరాణా షాపుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పల్లీ నూనె ధర కూడా లీటరుకు రూ. 220 మార్కును దాటి విక్రయించబడుతోంది.
యుద్ధ ప్రభావం
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే వచ్చే నెలలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. సామాన్యులు ఈ పెరిగిన ధరలను భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: