స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం యూఏఈ ఆర్థిక మంత్రి హెచ్‌ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సమావేశమైంది. హైదరాబాద్ సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ (Fourth City)’ ప్రాజెక్ట్‌ను సీఎం వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో రూపొందుతున్న ఈ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి యూఏఈ ప్రభుత్వం ఆసక్తి వ్యక్తం చేసింది.
Read Also: WEF: వరల్డ్ క్లాస్ ‘బ్యూటీ టెక్ హబ్’గా మారనున్న హైదరాబాద్!
బ్లైజ్‌తో ఎంవోయూ – ఏఐ, సెమీకండక్టర్ రంగాలకు ఊతం
దావోస్ వేదికగా కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఏఐ హార్డ్‌వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థతో ఒప్పందం వల్ల రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలు మరింత వేగం పొందనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌డీ సెంటర్ నిర్వహిస్తున్న బ్లైజ్, దానిని విస్తరించేందుకు పెట్టుబడులపై చర్చలు జరిపింది. హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగాల్లో ఏఐ పైలట్ ప్రాజెక్టులకూ అవకాశాలు పరిశీలించారు.
ఇజ్రాయెల్‌తో టెక్ భాగస్వామ్యం
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి,(CM Revanth) ఇజ్రాయెల్ ఇన్నొవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్‌తో భేటీ అయ్యారు. ఏఐ, హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వనున్నట్లు సీఎంవో వెల్లడించింది. ఇజ్రాయెలీ స్టార్టప్‌లతో కలిసి రాష్ట్రంలో పైలట్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్ కార్యాలయం
గ్లోబల్ ఫిన్‌టెక్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రముఖ అంతర్జాతీయ పేమెంట్స్ సంస్థ మాస్టర్‌కార్డ్ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు దావోస్‌లో ప్రకటించింది. డిజిటల్ ఎకానమీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో తెలంగాణ కీలక కేంద్రంగా ఎదుగుతోందని మాస్టర్‌కార్డ్ సీఈవో మైఖేల్ మీబాచ్ తెలిపారు.
అంతర్జాతీయ సంస్థల ఆసక్తి
రాయల్ ఫిలిప్స్, గూగుల్, యూనిలీవర్, సౌదీ అరేబియాకు చెందిన ఎక్స్‌పర్టయిజ్ వంటి సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్‌లో పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులు, ఇన్నోవేషన్‌పై విస్తృతంగా చర్చలు జరిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: