📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

CJI: తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్‌ గవాయ్

Author Icon By Saritha
Updated: October 9, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆ ఘటన చూసి షాక్ అయ్యాం” – సీజేఐ గవాయ్ స్పష్టీకరణ

సుప్రీంకోర్టులో ఇటీవల జరిగిన విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్‌(BR Gavai)పై లాయర్‌ రాకేష్ కిషోర్‌ షూ విసిరిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటనపై సీజేఐ గవాయ్‌ స్పందిస్తూ, ఆ రోజు జరిగిన సంఘటన తనకు, తన తోటి న్యాయమూర్తికి షాక్ కలిగించిందని తెలిపారు. “అది మా జీవితంలో ఒక మర్చిపోయిన అధ్యాయం” అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. మొదట రాకేష్ కిషోర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన అసోసియేషన్, అనంతరం ఆయనను శాశ్వతంగా బహిష్కరించింది. ఇకపై ఆయనకు కోర్ట్‌ ప్రాంగణంలో ప్రవేశం లేదని, ఎంట్రీ కార్డును రద్దు చేశామని అధికారికంగా ప్రకటించింది.

Read also: ప్రతి కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం.. తేజస్వి యాదవ్‌:

లాయర్ రాకేష్ కిషోర్‌ బహిష్కరణపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్ నిర్ణయం

అక్టోబర్ 6న జరిగిన ఈ ఘటనలో, కోర్టు నెంబర్ 1 హాల్‌లో విచారణ జరుగుతున్న సమయంలో రాకేష్ కిషోర్‌ కోపంతో షూ విసిరినా అది ధర్మాసనం దాకా వెళ్లలేదు. వెంటనే ఇతర లాయర్లు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టు సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సీజేఐ గవాయ్‌(CJI)తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్‌ గవాయ్ మాత్రం కోర్టు కార్యకలాపాలను ఆపకుండా కొనసాగించారు.

తదుపరి విచారణలో రాకేష్‌ కిషోర్‌ సనాతన ధర్మాన్ని అవమానించారని ఆరోపిస్తూ, “ఇది దైవ నిర్ణయం” అని తన చర్యను సమర్థించుకున్నాడు. అయితే, వివరణ తీసుకోకుండానే తాను బహిష్కరించడాన్ని తాను తప్పుబట్టాడు. ఈ ఘటనపై బెంగళూరులో కూడా మరో కేసు నమోదైంది. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సల దీనిపై ఫిర్యాదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

cji br gavai court incident Delhi news Indian Law lawyer attack Rakesh Kishore Supreme Court Supreme Court Bar Association

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.