పొగతాగే అలవాటు ఉన్నవారి జేబుకు చిల్లు పడనున్నది. భారత ప్రభుత్వం సిగరెట్లపై పన్నుల విధానంలో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సిగరెట్లపై ప్రత్యేక ‘సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ’ని పునరుద్ధరించింది. దీనివల్ల ఫిబ్రవరి 1, 2026 నుంచి సిగరెట్ (cigarette) ధరలు అమాంతం పెరగనున్నాయి.
Read also: TajGVK: షాలిని భూపాల్ షేర్ కొనుగోలు
Prices are set to increase significantly
కొత్త ట్యాక్స్ రూల్స్ ఏమిటంటే?
ఇప్పటివరకు సిగరెట్లపై కేవలం జిఎస్ టితో పాటు కాంపెన్సేషన్ సెస్ మాత్రమే ఉండేవి. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ప్రతి 1,000 సిగరెట్ స్టిక్స్ పై ప్రభుత్వం నిర్దిష్టమైన ఎక్సైజ్ డ్యూటీని విధించింది. 65 ఎంఎంలోపు (ఫిల్టర్ లేనివి): 1,000స్టిక్కు రూ.2,50 పన్ను, 70-75 (ఫిల్టర్ ఉన్నవి): 1,000 స్టిక్స్ కు రూ.5,400 పన్ను. ప్రిమియం/కింగ్ సైజ్: 1,000 స్టిక్స్ కు ఏకంగా రూ. 8,500 వరకు పన్ను పడనుంది. చిన్న సిగరెట్లపై ఒక్కో స్టిక్ కు సుమారు రూ.2.05 నుండి రూ.2.10 వరకు పెరుగుతుంది. మీడియం సైజు (65-70) సిగరెట్లపై రూ.3,60 నుంచి రూ.4.00 వరకు పెరగవచ్చు. కింగ్ సైజ్ లేదా ప్రీమియం సిగరెట్లపై ఒక్కో స్టిక్ కు రూ.5.40 నుండి రూ.8.50పైనే భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.18కి దొరుకుతున్న ప్రీమియం సిగరెట్ ఫిబ్రవరి నుంచి రూ.22 నుండి రూ.25 మధ్యకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: