📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Latest Telugu News: Xiaomi చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థకు యాపిల్, శాంసంగ్ షాక్

Author Icon By Vanipushpa
Updated: August 28, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ చైనా(China) స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్(Apple, Samsung) గట్టి షాక్ ఇచ్చాయి. తమ ప్రీమియం ఫోన్లను లక్ష్యంగా చేసుకుని, వాటిని పోలుస్తూ షియోమీ చేసిన ప్రకటనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రెండు కంపెనీలు వేర్వేరుగా లీగల్ నోటీసులు జారీ చేశాయి. తమ బ్రాండ్ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా ఉన్న ఈ ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశాయి.

యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ కెమెరా
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో షియోమీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘షియోమీ 15 అల్ట్రా’ను ప్రమోట్ చేస్తూ కొన్ని ప్రకటనలు చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజున వార్తాపత్రికల్లో పూర్తి పేజీ యాడ్స్ ఇచ్చి, యాపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ కెమెరా తమ ఫోన్ ముందు సరిపోదంటూ ఎగతాళి చేసింది. అంతకుముందు మార్చిలో జరిగిన ఇండియా లాంచ్‌లో కూడా ఐఫోన్ కెమెరాను “క్యూట్” అంటూ వ్యాఖ్యానించింది. శాంసంగ్ ప్రీమియం ఫోన్లను ఉద్దేశించి కూడా ఇలాంటి ప్రచారమే చేసింది.

Xiaomi చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థకు యాపిల్, శాంసంగ్ షాక్

ఉత్పత్తులను కించపరిచేలా ప్రచారం

ఈ తరహా ప్రకటనలు వ్యాపార పోటీ పరిధిని దాటి, తమ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని యాపిల్, శాంసంగ్ ఆరోపిస్తున్నాయి. పోటీదారుల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ, వారి ఉత్పత్తులను కించపరిచేలా ప్రచారం చేయడాన్ని ‘యాంబుష్ మార్కెటింగ్’ అంటారు. ఈ విధానంపైనే ఆ రెండు కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. “సాధారణంగా స్పెసిఫికేషన్లను పోల్చుకోవచ్చు. కానీ, ప్రత్యర్థి కంపెనీ పేరును నేరుగా వాడకూడదు. దానికి బదులుగా ‘పోటీదారుల ఫోన్లు’ అని చెప్పాలి” అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు.
రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో ..
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్ బ్రాండ్‌గా పేరున్న షియోమీ, ఇటీవలి కాలంలో ప్రీమియం సెగ్మెంట్‌లో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదిక ప్రకారం, 2025 రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో శాంసంగ్ 14.5% వాటాతో అగ్రస్థానంలో ఉండగా, షియోమీ (9.6%), యాపిల్ (7.5%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియం మార్కెట్లో తన వాటాను పెంచుకోవడానికే షియోమీ ఈ దూకుడు ప్రచార వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ లీగల్ నోటీసులపై షియోమీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Xiaomi మంచి ఫోన్నా?
అవును, Xiaomi ఫోన్‌లు సాధారణంగా మంచి విలువగా పరిగణించబడతాయి, సరసమైన ధరలకు హై-ఎండ్ ఫీచర్లు మరియు ఘన నిర్మాణ నాణ్యతను అందిస్తాయి, అయితే కొన్ని బడ్జెట్ మోడళ్లలో పోటీదారులతో పోలిస్తే ప్రకటనలు, అప్పుడప్పుడు తాపన సమస్యలు మరియు నెమ్మదిగా సాఫ్ట్‌వేర్ నవీకరణలు వంటి పరిమితులు ఉండవచ్చు.
ఏది మంచి Samsung లేదా Xiaomi?
Samsung లేదా Xiaomi రెండూ మొత్తం మీద ఖచ్చితంగా "మెరుగైనవి" కావు; ఉత్తమ ఎంపిక మీ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. Samsung నమ్మకమైన పనితీరు, విస్తృతమైన సాఫ్ట్‌వేర్ మద్దతు, ప్రీమియం డిజైన్ మరియు మరింత స్థిరపడిన పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది, ముఖ్యంగా అద్భుతమైన దీర్ఘకాలిక మద్దతుతో స్థిరంగా నమ్మదగిన మరియు అధునాతన పరికరాన్ని కోరుకునే వారికి ఆకర్షణీయంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/stock-market-today-bse-sensex-nse-nifty-live-updates/business/536880/

Apple China Smartphone Global Market Latest News Breaking News Mobile Market Samsung Smartphone Industry Tech Competition

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.