📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు

Gold Washed Away : ఆకస్మిక వరదలకు కొట్టుకుపోయిన బంగారం

Author Icon By Sudha
Updated: July 31, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా (China)దేశాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో చైనాలోని షాన్‌షీ ప్రావిన్స్‌లో అనేక ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. ఈ వరదల వల్ల ఒక నగల దుకాణంలో ఉన్న రూ. కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయిన (Gold Washed Away)ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. వర్షానికి రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే, ఆ ప్రాంతంలో ఓ బంగారు ఆభరణాల దుకాణాన్ని ఉదయం తెరిచి ఉంచగా.. ఆ షాప్‌లోకి వరద ఒక్కసారిగా పోటెత్తింది. దుకాణంలోని బంగారు ఆభరణాలన్నీ కొట్టుకుపోయాయి. కళ్లముందే బంగారం కొట్టుకుపోవడంతో దుకాణం యజమాని గుండెలు బాదుకుంటున్నాడు.

Gold Washed Away : ఆకస్మిక వరదలకు కొట్టుకుపోయిన బంగారం

కొట్టుకుపోయిన వాటిలో హారాలు, ఉంగరాలు, గాజులు, చెవి కమ్మలు, వజ్రాల ఉంగరాలు, కొన్ని వెండి వస్తువులు ఉన్నట్లు దుకాణం యజమాని తెలిపారు. వీటితోపాటు సేల్స్‌ బాక్స్‌ కూడా పోయిందన్నారు. అందులో రీసైకిల్‌ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వరదలకు దాదాపు 20 కేజీల బంగారం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి విలువ రూ.12 కోట్లకు పైమాటే అని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కొట్టుకుపోయిన బంగారం వెతికేందుకు ఎగబడ్డారు. వీధుల్లో బురద నీటిలో అనువణువూ వెతకడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

నెంబర్ వన్ గోల్డ్ మైనింగ్ దేశం ఏది?

370 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తితో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందింది. 2024లో ప్రపంచంలోనే టాప్-10 బంగారం ఉత్పత్తి చేసే దేశాల పేర్లను తెలుసుకోండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క సంక్లిష్టమైన వస్త్రంలో, బంగారం సంపద మరియు స్థిరత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది.

బంగారం ఏ దేశంలో చౌకగా ఉంటుంది?

మలావి బంగారం ధరలు తక్కువగా ఉన్న దేశంగా పరిగణించదగినది. ప్రపంచంలోనే బంగారం ధర తక్కువగా ఉన్న దేశం కోసం చూస్తున్నట్లయితే ఇది అగ్ర గమ్యస్థానాలలో ఒకటి. మలావిలో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు INR 6,346.63. ఈ దేశం దాని ఆతిథ్యం మరియు స్థానికుల హృదయపూర్వక వాతావరణానికి కూడా ప్రసిద్ధి చెందింది.

చైనా మొత్తం బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తోంది?

చైనా కేంద్ర బ్యాంకు కనీసం గత మూడు సంవత్సరాలుగా తన నిల్వలను పెంచుకోవడానికి భౌతిక బంగారాన్ని కొనుగోలు చేస్తోంది – మరియు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా ఆ దేశం రహస్యంగా మరింత ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: F35 jet: అమెరికాలో కూలిన ఎఫ్-35 యుద్ధ విమానం

Breaking News china Flash Flood Gold Washed Away Heavy Rainfall Jewelry Shop latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.