📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు

Chikungunya: చైనాలో విస్తరిస్తున్న చికున్‌గునియా వైర‌స్

Author Icon By Sudha
Updated: August 5, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలో చికున్‌గునియా (Chikungunya) వైరస్ కలకలం రేపుతోంది. గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులో ఈ వైరస్‌ బలంగా విజృంభిస్తోంది. జూలై నెల నుండి ఇప్పటివరకు దాదాపు 7,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య అధికారులు తీవ్ర అలర్ట్‌ స్థితిలోకి వెళ్లారు. చికున్‌గునియా (Chikungunya) వైరస్‌ దోమల (Mosquitoes)ద్వారా వ్యాపించే వైరల్‌ జ్వరంగా పరిగణించబడుతుంది. ఇది జ్వరం, శరీర నొప్పులు, జాయింట్‌ పైన వాపు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉండటం వల్ల, అధికారులు దీన్ని కోవిడ్‌19 తరహాలోనే నియంత్రించాలన్న ధోరణిలో చర్యలు తీసుకుంటున్నారు.ఫోష‌న్ సిటీలో అధిక సంఖ్య‌లో చికున్‌గునియా (Chikungunya) పేషెంట్లు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ రోగుల బెడ్ల‌కు దోమ‌తెర‌ల‌ను ఏర్పాటు చేశారు. ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల‌ను డిశ్చార్జ్ చేయ‌నున్నారు. లేదంటే క‌నీసం వారం రోజుల పాటు ఆస్ప‌త్రిలో స్టే చేయాల్సి ఉంటుంది.

Chikungunya: చైనాలో విస్తరిస్తున్న చికున్‌గునియా వైర‌స్

ఇన్‌ఫెక్ష‌న్ సోకిన దోమ కాటు వ‌ల్ల‌ చికున్‌గునియా వైర‌స్ వ్యాపిస్తుంది. నిజానికి చైనాలో చికున్‌గునియా కేసులు త‌క్కువే, కానీ ద‌క్షిణాసియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో చికున్‌గునియా కేసులు ఎక్కువ‌. తాజాగా ఫోష‌న్ సిటీతో పాటు మ‌రో 12 సిటీల్లో ఇన్‌ఫెక్ష‌న్లు న‌మోదు అయ్యాయి. ఫోష‌న్ వెళ్లివ‌చ్చిన హాంగ్‌కాంగ్ పిల్లోడికి వైర‌స్ సోకిన‌ట్లు ఆ దేశం చెప్పింది. చికున్‌గునియా కేసుల్లో 95 శాతం రోగుల‌కు స్వ‌ల్ప స్థాయి ల‌క్ష‌ణాలు న‌మోదు అయ్యాయి. వారం రోజుల్లో వాళ్లు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చైనాలో చికున్‌గునియా కేసులు వ్యాప్తి కావ‌డంతో.. అమెరికా త‌మ ప్ర‌యాణికుల‌కు హెచ్చ‌రిక జారీ చేసింది. చైనా టూరులో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. జ్వ‌రం, కీళ్ల నొప్పులు, ర్యాషెస్ వ‌చ్చిన వాళ్లు త‌క్ష‌ణ‌మే ఆస్ప‌త్రికి వెళ్లాల‌ని అధికారులు పేర్కొన్నారు.

చికున్ గున్యా ని చికెన్ అని ఎందుకు అంటారు?

దీనికి చికెన్ లేదా పౌల్ట్రీతో ఎటువంటి సంబంధం లేదు , గతంలో బర్డ్ ఫ్లూ భయం కారణంగా ఇటీవల గందరగోళం ఏర్పడింది. ఈ వైరస్‌ను 1953లో రాస్ ఒక జ్వరసంబంధమైన రోగి నుండి వేరుచేశాడు మరియు భారతదేశంలో, ఈ వైరస్‌ను మొదట కలకత్తాలో 1963లో వేరుచేయబడింది మరియు చివరిగా 1971లో వ్యాప్తి చెందింది.

చికున్ గున్యా అరుదైన వ్యాధి?

దోమల ద్వారా సంక్రమించే చికున్‌గున్యా వైరస్ వల్ల కలిగే ఎరిథెమాటస్ స్కిన్ రాష్ (పిల్లలలో వెసిక్యులోబుల్లస్ గాయాలకు దారితీయవచ్చు)తో పాటు బలహీనపరిచే పాలిఆర్థ్రాల్జియాతో సంబంధం ఉన్న అధిక జ్వరంతో కూడిన అరుదైన అంటు వ్యాధి.

చికున్గునియా ఎముకలను ప్రభావితం చేస్తుందా?

ఈ వ్యాధి కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా ఉంటుంది, దీని ఫలితంగా నొప్పి మరియు ఎముక కోత వంటి ఇతర ఎముక మరియు కీళ్ల సమస్యలు వస్తాయి.

Breaking News Chikungunya china Guangdong Province latest news Mosquito-borne Disease Telugu News Virus Outbreak

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.