📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Chicken Price in Hyderabad: దిగివస్తున్న చికెన్ ధరలు

Author Icon By Tejaswini Y
Updated: February 6, 2026 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chicken Price in Hyderabad : రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు దిగివస్తున్నాయి. అదే సమయంలో కొడిగుడ్ల ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ధరలు దిగివస్తుండడంతో మాంసాహారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు వరుసగా పండుగలు, జాతరలు, సెలవులు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో సంక్రాంతి, మేడారం జాతర ఉండటంతో వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధరల్లో పెరుగుదల నమోదైంది.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

Chicken Price in Hyderabad: Falling Chicken Prices

ప్రస్తుతం పండగల సీజన్ ముగియడంతో చికెన్ డిమాండ్ తగ్గింది. దీంతో గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు తగ్గుతూ వస్తోండటంతో సామాన్యులకు భారం తగ్గుతోంది. గత నెలలో చికెన్ ధరలు పెరిగాయి. సంక్రాంతి సందర్భంగా కేజీ బ్రాయిలర్ చికెన్ అయితే రోజులుగా తగ్గుముఖం గత పది ధరలు పడుతు ధర రూ.350 పలికిందిన్నాయి. కోళ్ల ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.240కే లభిస్తోంది. గత నెలతో పోలిస్తే కిలోపై ఏకంగా రూ.100 మేర ధర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో లైవ్ చికెన్ రూ.140గా కొనసాగుతోండగా డ్రెస్ డ్ రూ.220గా ఉంది.

స్కిన్లెస్ కేజీ చికెన్ రూ.240 నుంచి 250 మధ్య పలుకుతోంది. ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరగడంతో కోళ్ల లభ్యత కూడా ఎక్కువగా ఉంది. దీంతో చికెన్ ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నాయి. ఇక కోళ్ల ఉత్పత్తి మరింతగా తగ్గితే ధరలు ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశముందని పేర్కొంటున్నారు. కాగా చికెన్ ధరలతోపాటు కోడిగుడ్ల ధరలు పడిపోతున్నాయి. మొన్నటివరకు ఒక్కో కోడిగుడ్డు రూ.9 వరకు పలకగా పది రోజులుగా ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. రెండు నెలలపాటు రూ.9 వద్ద గుడ్ల ధరలు కొనసాగాయి. అయితే ఇప్పుడు ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు రూ.6కే లభిస్తోంది. ఇప్పుడు చికెన్ ధరతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా ఆమాంతం తగ్గిపోతున్నాయి. దీంతో సామాన్యులపై ఇంటి ఖర్చుల భారం తగ్గుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Chicken price drop Chicken Prices Egg prices Hyderabad market Hyderabad News Meat prices Telugu Poultry rates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.