📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

CEO: ఒక్క వీడియో కాల్ తో ఉద్యోగులందర్నీ పీకేసిన సీఈఓ..ఎందుకంటే!

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 2:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన లేఅప్స్ నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి(Corona pandemic) తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు(Layoffs) మహమ్మారి పోయి 5 ఏళ్లు దాటినా ఇంకా ఉద్యోగ తొలగింపులు మాత్రం ఆగడం లేదు.ఇక ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లలో తొలగింపులు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా(without Notice)ను అకస్మాత్తుగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. మహమ్మారి తర్వాత నుంచి కంపెనీలు అన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభం(Financial Crisis)లోకి వెళ్ళిపోయాయి. ఏడాదికేడాది పరిస్థితులు చక్కబడుతూ వచ్చినప్పటికీ ఇంకా ఆర్థిక మాంద్యంలోనే కంపెనీలు కొట్టుమిట్టాడుతున్నాయి.

CEO అత్యవసర సమావేశం..

ఇక ముందు ముందు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో దిగ్గజ కంపెనీలన్నీ కాస్ట్ కటింగ్ ప్రారంభించాయి. తాజాగా ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ వీడియో కాల్ ద్వారా ఉద్యోగులు అందర్నీ తొలగించిన సంఘటన షాక్‌కు గురిచేసింది. ఒక భారతీయ ఐటీ స్టార్టప్‌లో పనిచేస్తున్న ఉద్యోగి తన రెడ్డిట్ సైట్‌లో ఈ సమాచారాన్ని ప్రచురించారు. అతను పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే ఆ రోజు మాకు అకస్మాత్తుగా CEO అత్యవసర సమావేశం ఉందని చెప్పినప్పుడు మేము మా పని దినాన్ని ప్రారంభించాము. నాతో పాటుగా మిగతా సహోద్యోగులంతా వీడియో కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నాము.

CEO: ఒక్క వీడియో కాల్ తో ఉద్యోగులందర్నీ పీకేసిన సీఈఓ..ఎందుకంటే!

కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి

సీఈఓ అకస్మాత్తుగా బాంబు పేల్చాడు.. కంపెనీ వద్ద తగినంత నిధులు లేవని.. కాబట్టి ఈ నెల మీకు జీతం రాదు. రేపటి నుండి ఎవరూ పనికి రావొద్దని చెప్పుకొచ్చాడు. అకస్మాత్తుగా మన కంపెనీలో పెట్టిన పెట్టుబడిదారులందరూ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో కంపెనీ మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అదే కంపెనీని మూసివేయడానికి కారణమని సీఈఓ మాతో చెప్పినట్లు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు తెలిసిన కంపెనీలలో మీకు ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎంత మందికి ఉద్యోగాలు దొరుకుతాయో నేను ఖచ్చితంగా చెప్పలేను” అని CEO అన్నట్లుగా పోస్టులో తెలిపాడు.

మీరు మీ ఆశ కోల్పోకండి..
గత నవంబర్ లో నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను.. మా CEO కూడా అదే కారణంతో అందరినీ తొలగించారు. లేఆఫ్ ప్రకటన నుండి కోలుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది. అప్పటి నుండి, నేను కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాను. ప్రస్తుతం వేరే ఉద్యోగంలో పనిచేస్తున్నాను. మీరు మీ ఆశ కోల్పోకండి. గట్టిగా ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభిస్తుంది అని ఒక నెటిజన్ తెలిపారు. మరో యూజర్ గత నెలలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని..మీరు ఓడిపోకుండా ప్రయత్నిస్తూ ఉండండి. ప్రతిచోటా అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆశను కోల్పోకండని అన్నారు. .

CEO పాత్ర ఏమిటి?
CEO (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) పాత్ర కంపెనీకి మొత్తం దిశానిర్దేశం మరియు నాయకత్వాన్ని అందించడం. సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలు మరియు లక్ష్యాలను నిర్దేశించడం మరియు వాటిని సాధించడానికి అవసరమైన వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవడం వారి బాధ్యత.
CEO ఉద్యోగ జీతం అంటే ఏమిటి?
భారతదేశంలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) విస్తృత శ్రేణి జీతాలను ఆశించవచ్చు, సాధారణంగా సంవత్సరానికి ₹12 లక్షల నుండి ₹1 కోటి వరకు, అని యాంబిషన్‌బాక్స్ మరియు పాలసీబజార్ చెబుతున్నాయి. ఖచ్చితమైన జీతం పరిశ్రమ, కంపెనీ పరిమాణం, అనుభవం మరియు స్థానం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

read also: Israel-Hamas War: గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ 40 మంది మృతి

#telugu News CEO controversy CEO fires employees corporate layoffs employee termination news mass layoff video call shocking termination video tech company layoffs viral CEO video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.