📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Celebrity Betting Scam: టాప్ టాలీవుడ్‌ హీరోలపై ఈడీ కేసు

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో భారీ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం రేపుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన పెద్ద స్కాంలో ఒకటైన బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ తెలుగు నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్లు శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి తదితరులపై ఈడీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు మనీలాండరింగ్ చట్టాల కింద విచారణను ఎదుర్కొననున్నారు.

Celebrity Betting Scam: టాప్ టాలీవుడ్‌ హీరోలపై ఈడీ కేసు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. పోలీసులు ఇప్పటికే 19 మంది యాప్ యజమానులపై కేసు నమోదు చేశారు.విచారణకు గురైన యాప్‌లలో జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్365, జై365, జెట్ ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్ర365 ఉన్నాయి. ఈ కేసు భారతీయ న్యాయసంహిత సెక్షన్లు 318(4), 112, రెడ్‌విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 3(ఎ), 4, అలాగే ఐటీ చట్టం 2000, 2008 సెక్షన్ 66డి కింద నమోదు చేశారు. ఈడీ ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు పంపించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేయడానికి సిద్ధమవుతోంది.

అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు

విచారణ మరింత ముమ్మరంగా సాగే అవకాశముంది. – గతంలో నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీమ్స్ దీనిపై స్పష్టత ఇచ్చారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు వారు ఎప్పుడూ ప్రచారం చేయలేదని, చట్టబద్ధమైన అనుమతులు ఉన్న నైపుణ్యాధారిత గేమింగ్ యాప్‌లకు మాత్రమే ప్రచారం చేశామని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ తన టీమ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో “ఏ23” అనే యాప్‌తో చేసిన ప్రచార ఒప్పందం ఇప్పటికే ముగిసిపోయిందని, ప్రస్తుతం ఆ యాప్‌తో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కూలోడి కొడుకు ఆకలితో పస్తులుండి కోట్లు సంపాదించాడు.. వచ్చే జీతాన్ని పొదుపుగా ఎలా వాడాడో తెలుసా.. ఇదే తరహాలో రానా దగ్గుబాటి టీమ్ కూడా స్పందిస్తూ, రానా ఒప్పందం 2017లోనే పూర్తయ్యిందని వెల్లడించారు. చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్‌లకు మాత్రమే తాము ప్రచారం చేశామని, నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు హైదరాబాద్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు .

 బెట్టింగ్ స్కామ్ అంటే ఏమిటి?
బెట్టింగ్ లేదా స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ అంటే ఒక స్కామర్ బాధితుడిని 'ఫెయిల్‌సేఫ్' బెట్టింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్‌వేర్‌లో పెట్టుబడి పెట్టమని ఒప్పిస్తాడు. ఒక స్కామర్ క్రీడా కార్యక్రమాలపై వ్యవస్థ లాభానికి హామీ ఇస్తుందని మీకు చెబుతాడు.
బెట్టింగ్ వల్ల కలిగే ప్రమాదం ఏమిటి?
జూదం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. వీటిలో ఆర్థిక ఒత్తిడి, సంబంధాల విచ్ఛిన్నం, కుటుంబ హింస, మానసిక అనారోగ్యం మరియు ఆత్మహత్య ఉన్నాయి. జూదం హాని యొక్క వారసత్వం ఒకరి జీవితాంతం కొనసాగుతుంది మరియు తరతరాలుగా వ్యాపిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

read also: Israel-Hamas War: గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ 40 మంది మృతి

#telugu News celebrity betting scam ED case Tollywood Enforcement Directorate Tollywood Telugu actors ED case Tollywood betting scam Tollywood drug and betting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.