📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC Loan Fraud : ZEE సుభాష్ పై CBI కేసు

Author Icon By Sudheer
Updated: September 5, 2026 • 8:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

LIC Loan Fraud : జీ (ZEE) గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తీవ్రమైన క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సుభాష్ చంద్రతో పాటు మరికొందరిపై సిబిఐ ప్రథమ సమాచార నివేదిక (FIR) దాఖలు చేసింది. తప్పుడు మరియు నకిలీ పత్రాలను సృష్టించి తన నికర ఆస్తి (నెట్‌వర్త్) విలువను ఏకంగా రూ. 59,113 కోట్లుగా చూపించారనేది ప్రధాన ఆరోపణ. ఈ తప్పుడు పత్రాల ఆధారంగా తన వ్యక్తిగత గ్యారంటీని ఉపయోగించి వివిధ అనుబంధ కంపెనీలకు రూ. 1,322 కోట్ల మేర రుణాలను ఇప్పించి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also : బ్యాంకింగ్ వ్యవస్థకు ఆర్‌బీఐ షాక్.. రూ.7 లక్షల కోట్లు వెనక్కి!

ఎన్సీఎల్టీ తీర్పు వివాదం మరియు తదుపరి పరిణామాలు

ఈ రూ. 1,322 కోట్ల బారీ రుణాల రికవరీ మరియు సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ తీర్పుపై పెను విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలోనే సీబీఐ రంగంలోకి దిగి క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలలో నకిలీ పత్రాలతో పెద్ద ఎత్తున మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Google News in Telugu Latest News in Telugu LIC Housing Finance Loan Fraud NCLT Verdict Controversy Subhash Chandra CBI Case Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.