Cashback SBI Card: ఎస్‌బీఐ కార్డ్ (SBI Card) తన వినియోగదారులకు షాకింగ్ వార్తను అందించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ‘క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్’ (Cashback SBI Card) ప్రయోజనాల్లో భారీ కోత విధిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ విధానంలో కూడా కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల వల్ల ముఖ్యంగా భారీగా షాపింగ్ చేసే (Heavy Spenders) కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
Read Also:Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్

ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్!
కొత్త నిబంధనల ప్రకారం, ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో పొందే గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితిని రూ. 4,000 కు తగ్గించారు. ఇందులో ఆన్‌లైన్ షాపింగ్‌పై 5% చొప్పున గరిష్టంగా రూ. 2,000 వరకు, ఆఫ్‌లైన్ (POS) లావాదేవీలపై 1% చొప్పున గరిష్టంగా రూ. 2,000 వరకు మాత్రమే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా, డిజిటల్ గేమింగ్, టోల్ చెల్లింపులు మరియు ప్రభుత్వ సంబంధిత లావాదేవీలను క్యాష్‌బ్యాక్ పరిధి నుండి పూర్తిగా తొలగించారు.
రివార్డ్ పాయింట్లను నగదు రూపంలోకి (Statement Credit) మార్చుకోవాలనుకునే వారికి కూడా కొత్త పరిమితులు విధించారు. ఇకపై నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లను మాత్రమే రిడీమ్ చేసుకోవడానికి వీలుంటుంది. అది కూడా కేవలం 4,000 గుణకాలలో (ఉదాహరణకు 4000, 8000…) మాత్రమే రిడీమ్ చేయాలి. అయితే, ఎయిర్ ఇండియా సిగ్నేచర్, ఫోన్‌పే పర్పుల్ వంటి కొన్ని ప్రీమియం కార్డ్‌లకు ఈ పరిమితుల నుండి మినహాయింపునిచ్చారు.
మరో ముఖ్యమైన మార్పు ‘పాయింట్ల రద్దు’ (Forfeiture) విషయంలో జరిగింది. ప్రమోషనల్ ఆఫర్ల ద్వారా వచ్చే పాయింట్లు ఇకపై శాశ్వతంగా ఉండవు. క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా వచ్చిన పాయింట్లు 90 రోజుల్లోపు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ద్వారా వచ్చిన పాయింట్లు 120 రోజుల్లోపు రద్దవుతాయి. కాబట్టి ఎస్‌బీఐ కార్డ్ యూజర్లు ఏప్రిల్ 1 లోపే తమ పాయింట్లను రిడీమ్ చేసుకోవడం లేదా కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: