📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ 

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసే దిశగా కెనరా బ్యాంక్ (Canara Bank) మరో కీలక అడుగు వేసింది. ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లతో కూడిన నూతన యూపీఐ యాప్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘కెనరా ఏఐ 1పే’ (AI 1 Pay) పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

Read Also: Battery Energy: వినియోగంలోకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విద్యుత్ సాంకేతికత!

Canara Bank’s new app named AI 1 Pay

డిజిటల్ చెల్లింపులు

ఇప్పటికే ఇతర యూపీఐ యాప్‌లలో రిజిస్టర్ అయిన కెనరా బ్యాంక్ ఖాతాదారులు సైతం సులభంగా మార్చుకోవచ్చు. కెనరా ఏఐ 1పే (AI 1 Pay) పేరుతో కొత్త యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఏ బ్యాంకు ఖాతానైనా లింక్ చేసుకొని వేగంగా, సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.

వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు, చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యక్తులు సైతం సులభంగా చెల్లింపులు స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఫీచర్ల విషయానికి వస్తే, నెలవారీ ఖర్చుల విశ్లేషణ, కేటగిరీల వారీగా వివరాలు, ఆర్థిక ట్రెండ్స్ వంటి ఆర్థిక నిర్వహణకు సహాయపడుతుంది.హోమ్ స్క్రీన్ లోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి త్వరగా చెల్లింపులు జరపవచ్చు. చిన్న మొత్తాలను చెల్లించేందుకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

బిల్లులు, సబ్ స్క్రిప్షన్లు, ఈఎంఐలు, ఎస్ఐపీల ఆటోమెటిక్ చెల్లింపులు కూడా చేసుకోవచ్చు.భద్రత విషయానికి వస్తే బయోమెట్రిక్ లాగిన్, డివైజ్ బైండింగ్ (రిజిస్టర్ మొబైల్ నుంచి మాత్రమే లావాదేవీలు) వంటి మల్టీ లెవెల్ సెక్యూరిటీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా అనుమానాస్పద లావాదేవీలను తక్షణం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI features Canara AI 1Pay canara bank Digital Banking latest news Telugu News UPI app

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.