ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి గూగుల్ తీసుకువచ్చిన తాజా మార్పులే నిదర్శనం. ఇప్పటివరకు మన సందేహాలకు మాత్రమే సమాధానాలు చెప్పిన ఏఐ టూల్స్ ఇకపై మనకు షాపింగ్ చేసిపెట్టే ఏజెంట్స్ లా మారబోతున్నాయి. గూగుల్ జెమినీ ఏఐ (Gemini AI).. ఇకపై మనం కోరుకున్న వస్తువులను వెతికి పెట్టి అక్కడికక్కడే కొనుగోలు చేసేలా (Instant Checkout) కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ తన జెమిని యాప్‌ను కేవలం అసిస్టెంట్‌గా మాత్రమే కాకుండా ఒక ‘వర్చువల్ మర్చంట్’గా మారుస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పెద్ద కంపెనీలతో జతకట్టిన గూగుల్ ఈ సరికొత్త షాపింగ్ అనుభవాన్ని అందించడానికి గూగుల్ ప్రపంచ ప్రసిద్ధ రిటైల్ సంస్థలైన వాల్‌మార్ట్ , షాపిఫై, వేఫెయిర్ వంటి కంపెనీలతో చేతులు కలిపింది.
Read Also: Sankranti Festival: పండుగ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు
నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసుకునేలా ఫీచర్
దీనివల్ల వినియోగదారులు జెమిని చాట్ బాక్స్ నుండి బయటకు రాకుండానే తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసుకునేలా ఫీచర్ తీసుకురాబోతోంది. ఉదాహరణకు, మీరు “ట్రిప్ కోసం బెస్ట్ వింటర్ జాకెట్ ఏది?” అని అడిగితే జెమిని వివిధ స్టోర్ల నుండి వస్తువులను చూపిస్తుంది. మీరు వాటిలో నచ్చినది సెలక్ట్ చేసుకుని అక్కడికక్కడే పేమెంట్ చేసి కొనుగోలు చేయవచ్చు. అంటే ఇక మీకు ఇతర షాపింగ్ యాప్స్ తో అవసరం లేదన్న మాట. ఏజెంట్-లెడ్ కామర్స్: రిటైల్ రంగంలో కొత్త మార్పు వాల్‌మార్ట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించారు. “సాధారణ సెర్చ్ నుండి ఏజెంట్ నేతృత్వంలోని వాణిజ్యానికి మారడం అనేది రిటైల్ రంగంలో ఒక గొప్ప పరిణామం” అని వాల్‌మార్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
అదనంగా 150 వాల్‌మార్ట్ స్టోర్లలో డ్రోన్ డెలివరీ సేవలు
దీన్ని బట్టి ఏఐ ప్రభావం షాపింగ్ రంగంలో ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్రోన్ డెలివరీ, ఫ్యూచర్ ప్లాన్స్ కేవలం ఆన్‌లైన్ షాపింగ్ మాత్రమే కాదు.. కొన్న వస్తువులను వేగంగా డెలివరీ చేయడానికి కూడా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, వాల్‌మార్ట్ కృషి చేస్తున్నాయి. అదనంగా 150 వాల్‌మార్ట్ స్టోర్లలో డ్రోన్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 2027 నాటికి ఈ సంఖ్యను 270కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జెమినీ ఏఐ (Gemini AI) ద్వారా షాపింగ్ చేసే ఫీచర్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, త్వరలోనే ఇది అంతర్జాతీయంగా విస్తరించనుంది.
Epaper: epaper.vaartha.com
Read Also: