మన దేశంలో మధ్యతరగతి పరిస్థితి ఒకింత విరుద్ధంగా మారింది. పేపర్ మీద జీతాలు పెరుగుతున్నట్లే కనిపిస్తున్నా, రోజువారీ ఖర్చులు చెల్లించిన తర్వాత చేతిలో మిగిలేది చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation). నిత్యావసరాలు, ఇంటి అద్దెలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతుండగా, ఆదాయపు పన్ను స్లాబ్‌లు మాత్రం మారకుండా ఉండటం ప్రజలపై భారం పెంచుతోంది.
Read Also: SBI: ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు
30% ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ పై అసంతృప్తి
ప్రస్తుత పన్ను విధానం ప్రకారం ఒక నిర్దిష్ట ఆదాయం దాటగానే ఏకంగా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత జీతం స్వల్పంగా పెరిగినప్పటికీ, తెలియకుండానే(Budget 2026) ఈ టాప్ ట్యాక్స్ బ్రాకెట్‌లోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా వారి కొనుగోలు సామర్థ్యం పెరగకపోగా, పన్ను భారం మరింత పెరుగుతోంది.
30% ట్యాక్స్ స్లాబ్‌ను పెంచాలని నిపుణుల సూచన
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం సుమారు రూ.24 లక్షల ఆదాయం పై వర్తిస్తున్న 30% స్లాబ్‌ను కనీసం రూ.35 లక్షల వరకు పెంచాలి. అలా చేస్తే మధ్యతరగతి కుటుంబాలకు నెలవారీ ఖర్చుల తర్వాత కొంత డబ్బు మిగిలి, ఆర్థిక(Budget 2026) ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తువుల ధరలు పెరుగుతుంటే, ట్యాక్స్ మినహాయింపు పరిమితులు మాత్రం అలాగే ఉండటం వల్ల ఒక సమస్య ఏర్పడుతుంది. దీనినే ‘బ్రాకెట్ క్రీప్’ అంటారు. అంటే జీతం పెరిగినా వాస్తవ ఆదాయం పెరగదు, కానీ ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తుంది. అందుకే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ట్యాక్స్ స్లాబ్‌లను ఆటోమేటిక్‌గా సవరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాక్స్ సడలింపులతో ప్రభుత్వానికి కూడా లాభమే
పన్ను తగ్గితే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందనే భావన ఉన్నా, వాస్తవంగా ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే ఖర్చులు పెరుగుతాయి. దాంతో:
- GST ఆదాయం పెరుగుతుంది
- పొదుపులు, పెట్టుబడులు పెరుగుతాయి
- పన్నులు నిజాయితీగా చెల్లించే సంస్కృతి బలపడుతుంది
ఇవి దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయి.
ఎవరికెవరికీ లాభం కలుగుతుంది?
- ఉద్యోగులకు: TDS తగ్గి చేతికి వచ్చే జీతం పెరుగుతుంది
- స్వయం ఉపాధి వర్గాలకు: వ్యాపార లాభాలను మళ్లీ పెట్టుబడిగా వినియోగించుకునే అవకాశం
- పెన్షనర్లకు: పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా పన్ను మినహాయింపులు ఉపశమనంగా ఉంటాయి
కేవలం ట్యాక్స్ స్లాబ్‌లే కాకుండా:
- హోమ్ లోన్ వడ్డీ మినహాయింపు (Section 24b) పరిమితి పెంపు
- స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
వంటి చర్యలు తీసుకుంటే మధ్యతరగతికి గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉంది.
ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకునేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: