हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Buddha : క్షమించే మనస్సు

venkatesh
Buddha : క్షమించే మనస్సు

Buddha : అది శాస్త్ర జేతవనంలో విహరిస్తున్న సమయం. ఆ సమయంలో శాస్త్ర మల్లికాదేవి కథను (Mallikadevi Story) బద్ధ భిక్షువులకు చెప్తాడు. ఒకరోజు రాజుకు మల్లికాదేవితో ప్రణయ కలహం సంభవించింది. ఆ కలహ ప్రభావం వల్ల రాజుకు ఆమెపై చాలా కోపం కలిగింది. కోపం వల్ల రాజు ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం మొదలు పెట్టాడు. రాజుకు తన పట్ల కోపం వచ్చిందనీ, అందువల్ల తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనీ ఆమె గ్రహించింది.

“ఈ విషయం శాస్తకు తెలిసి వుండదు. తెలిస్తే రాజును నన్ను నిర్లక్ష్యం చేయనిచ్చేవాడు కాదు” అనుకున్నది మల్లికాదేవి. అయితే శాస్తకు ఈ విషయం తెలిసింది. వాళ్లిద్దరినీ ఎట్టి పరిస్థితులలో కలపాలని శాస్త్ర నిర్ణయించుకున్నాడు. భార్యా భర్తల నడుమ చిన్న చిన్న అపోహలు చిలికి చిలికి గాలివానలై వారి బంధాన్ని దెబ్బ తీయకూడదన్నది శాస్త్ర విశ్వాసం. ఆలోచన వచ్చిన వెంటనే ఒకరోజు మధ్యాహ్నం అయిదు వందల మంది భిక్షువులను పిలిచాడు… “మీరందరూ పాత్ర, చీవరములు పట్టుకుని నా వెంట రండి” అన్నాడు. భిక్షువులంతా తథాగతుడు చెప్పినట్టు చేసారు. మధ్యాహ్నం వేళ ఆ అయిదు వందల మందితో కలిసి తథాగతుడు రాజభవనంలోకి ప్రవేశించాడు.

రాజు తథాగతుడిని చూసి ఎంతో సంతోషించాడు. అతడి చేతిలోని పాత్రను అందుకుని, తథాగతుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. తథాగతుడి వెంట వచ్చిన బుద్ధ పాడుచేసుకోకూడదు. భార్యా భర్తలు కలసి ఉంటేనే సంసారం నడుస్తుంది. సంసారం చక్కగా ఉంటేనే సన్యాస వ్యవస్థకు బలం వస్తుంది” అని వారిద్దరికీ అనునయంగా చెప్పాడు తథాగతుడు. ఆ రోజు నుంచీ వాళ్లు భేదాభిప్రాయాలను విడిచిపెట్టి చక్కగా కలసి ఉండటం ప్రారంభించారు. ఈ విషయం ధర్మసభలో భిక్షువులు చర్చించారు.

“శాస్త్ర ఒక్క మాటతో రాజదంపతుల నడుమ ఉన్న భేదాభిప్రాయాలను తుడిచిపెట్టి వారు చక్కగా కలసి ఉండేట్టు చేశారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం” అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో శాస్త్ర అక్కడికి వచ్చాడు. వారు మాట్లాడుతున్న విషయం అడిగి తెలుసుకున్నాడు. “భిక్షువులారా, ఇప్పుడే కాదు, పూర్వం కూడా ఒక్క మాటలో నేను వీరి నడుమ భేదాభిప్రాయాలు తొలగించి వీరు కలసి మెలసి ఉండేట్టు చేసాను” అన్నాడు. అది విన్న భిక్షువులలో గత జన్మ గాథ తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆ గాథ చెప్పమని శాస్త్రను వేడుకున్నారు. చిరునవ్వుతో వారి కోరికను మన్నించి గత జన్మ గాథను చెప్పటం ప్రారంభించాడు శాస్త.

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం అది. ఆ కాలంలో బోధిసత్వుడు ఆయనకు మంత్రిగా ఉండేవాడు. ఆర్ష ధర్మశాసనుడైన మంత్రిగా వ్యవహరించేవాడు. ఒకరోజు రాజు తన భవంతి కిటికీలోంచి తోటలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ నుంచున్నాడు. అదే సమయానికి రేగుపళ్లబుట్ట నెత్తినెట్టుకుని “రేగుపళ్లు… రేగుపళ్లు” అని అరుస్తూ రేగుపళ్లు అమ్ముతున్న తోటమాలి కూతురు మీద అతని దృష్టి పడింది. తోటమాలి కూతురు అందగత్తె.. చక్కని పిల్ల. ఆమెని చూడగానే, ఆమె కంఠస్వరం వినగానే ఎందుకో రాజుకు ఆమె నచ్చింది. ఆమెతో మాట్లాడాలనిపించింది.

ఆమెను తమ వైపు ఆకర్షించుకోవాలన్న కోరిక కలిగింది. రేగుపళ్లు అమ్ముతున్న ఆ యువతిని లోపలకు పిలిచాడు రాజు. ఆమెను రాణి సింహాసనంపై కూర్చోబెట్టాడు. రాజభవనంలోని విచిత్రాలు చూపించాడు. ఆమెకు రాజు ఎంతో ప్రియమయ్యాడు. ఆమె రాజుకు ప్రియురాలయింది. కొన్ని రోజుల తరువాత.. రాజు ఒకరోజు బంగారు పళ్లెంలోంచి రేగుపళ్లు తింటున్నాడు. సుజాతాదేవి రాజును అడిగింది “మహారాజా, ఏం తింటున్నారు ఆ బంగారు పళ్లెంలోంచి”. రాజుకు కోపం వచ్చింది.

“రేగుపళ్లు అమ్మే మాలి కూతురు రేగుపళ్లనే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు మాసిన చీర కట్టుకుని వీధులలో తిరుగుతూ రేగుపళ్లు అమ్మినదానివి, రాజభోగాలు రాగానే ఆ రేగుపళ్లనే మరచిపోయావు. రాజభోగాలు అనుభవించే అర్హత నీకు లేదు. ఎక్కడ ఏ రకమైన పళ్లనూ ఏరుకోలేని స్థలంలో ఈమెను వదలివేసి రండి” అని భటులను ఆజ్ఞాపించాడు రాజు.

ఇది బోధిసత్వుడికి తెలిసింది. రాజాజ్ఞ అమలు అయ్యేలోగా వారిద్దరి నడుమ సయోధ్య కుదుర్చాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే రాజభవనం చేరుకున్నాడు. “రాజా, ఉత్తమ పదవిలో ఉన్న స్త్రీలలో ఇలాంటి లోపం కనిపించటం సహజం. తాము అనుభవిస్తున్న ఐశ్వర్యం శాశ్వతం అనుకుని ఒకప్పటి కష్టాన్ని మరచి అహంకరించటం సాధారణం. కాబట్టి కోపం వద్దు. సుజాతను క్షమించండి. ఇద్దరూ కలసి మెలసి ఉండండి” అన్నాడు. బోధిసత్త్యుడి మాటను కాదనలేకపోయాడు రాజు. ఆమెను క్షమించాడు. ఆ తరువాత ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా వారిరువురూ కలసి మెలసి జీవించారు.

Buddha : కథ పూర్తయిన తరువాత ముగింపుగా చెప్పాడు శాస్త్ర “ఆ కాలంలో ఆ వారణాసీ రాజు కోసలరాజు. సుజాత ఇప్పటి మల్లిక. మంత్రిని నేనే”. శయ్యపై అటూ ఇటూ దొర్లుతూ శాస్త్ర ఆనంద స్థవిరుడిని గురించి కథ చెప్పాడు. ఉద్యానవనం వసారాలో ఆయుష్మాన్ పెద్దగా రోదించటం ప్రారంభించాడు. “నా శిక్షణ పూర్తి కాలేదు. ఇరవై అయిదు సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను. శాస్త్ర మరణించాడు. నా సేవ అంతా నిష్ఫలమవుతుంది. నా జీవితం వ్యర్థం అయింది” అంటూ పెద్దగా రోదించాడు. శాస్త్ర మరణించలేదు. ఈ రోదన అంతా విన్నాడు.

ఆనందుడిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. “ఆనందా, రోదించకు. నువ్వు పుణ్యార్జన చేశావు. ఇంకా ప్రయత్నించు. విచారించి లాభం లేదు. పూర్వ జన్మలో నువ్వు విరాగి కాకుండా ఉన్నప్పుడు కూడా నాకు చేసిన సేవ నిష్ఫలం కాలేదు. అలాగే ఇప్పుడు నువ్వు చేసిన సేవ నిష్ఫలం కాదు” అన్నాడు. ఆ మాటలు విన్న వారందరికీ కుతూహలం కలిగింది. ఆనందుడి పూర్వ జన్మ గాథ తెలుసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. ఆ గాథ చెప్పమని శాస్త్రను బతిమిలాడేరు. వారి మాటను మన్నించిన శాస్త పూర్వ జన్మ గాథను చెప్పటం ప్రారంభించాడు.

అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్వుడు పలాశ వృక్ష దేవతగా జన్మించాడు. ఆ కాలంలో కాశీ ప్రజలు దేవతలను పూజించేవారు. ఒక దరిద్ర బ్రాహ్మణుడు “నేను కూడా దేవతలను పూజిస్తాను. అందరూ దేవతలను పూజిస్తున్నారు” అనుకున్నాడు. అతడు పలాశ వృక్షం కింద ఒక చక్కని స్థలం వెతుక్కున్నాడు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాడు. అక్కడున్న గడ్డీ పెరికివేశాడు. నాలుగు వైపుల ఇసుకను పరచాడు, శుభ్రంగా ఊడ్చాడు. వృక్షం మీద దేవతా చిహ్నాలు పెట్టాడు. ధూప దీపాదులు సమకూర్చుకున్నాడు, పూజ చేశాడు. ప్రదక్షిణం చేశాడు.

Buddha : ఇంటికి వెళ్తూ “సుఖంగా నిద్రించమని” దేవతను అభర్థించాడు. మళ్లీ పొద్దున్నే వచ్చి “సుఖంగా నిద్రించావా?” అడిగేవాడు దేవతను. మరుసటి రోజు మళ్లీ అంతా శుభ్రం చేసి పూజ చేసి వెళ్తూ “సుఖంగా నిద్రించమని” అభ్యర్థించి ఈ రకంగా కొన్నాళ్లు గడిచింది. రోజూ పూజలందుకుంటున్న వృక్ష దేవత ఒకరోజు ఇలా అనుకుంది… “ఈ బ్రాహ్మణుడు ప్రతిరోజూ నాకు సేవ చేస్తున్నాడు. ఇతడు ఏమీ కోరిక కోరటం లేదు. అయినా సరే ఏదో కోరిక లేకపోతే పూజ చేయడు. ఇతడి కోరిక ఏమిటో తెలుసుకుంటాను” అనుకుంది.

మరుసటి రోజు బ్రాహ్మణుడు వచ్చి ఊడ్చే సమయంలో బ్రాహ్మణుడి రూపం ధరించి అతడి దగ్గరకు వచ్చింది వృక్ష దేవత. బ్రాహ్మణ రూపంలో ఉన్న వృక్షదేవత ఆ బ్రాహ్మణుడిని అడిగింది “రోజూ జడమైన వృక్షానికి పూజ చేస్తావు. సుఖంగా నిద్రించమంటావు. ఇందుకు కారణం ఏమిటి?” “చాలా పెద్దగా ఉత్తమంగా ఉందీ వృక్షం. ఇది తప్పకుండా దేవతా భూమి అయి ఉంటుందని పూజలు చేస్తున్నాను. నాకు ధన కాంక్ష ఉంది. అందుకని దేవతకు, చెట్టుకూ ప్రదక్షిణాలు చేస్తున్నాను” అన్నాడు ఆ బ్రాహ్మణుడు.

Buddha : “నీ భక్తి ప్రపత్తులు, దీక్ష నాకు నచ్చాయి. నీకు తగిన ప్రతిఫలం ఇస్తాను. నువ్వు కోరుకున్నట్లు నిన్ను ధనవంతుడిని చేస్తాను. భయపడకు నేను వృక్షదేవతను” అన్నది వృక్ష దేవత. నమ్మకం కుదరక చూస్తున్న బ్రాహ్మణుడికి అభయం ఇచ్చి చెప్పింది వృక్ష దేవత. “చెట్టు మొదట్లో ప్రాచీన యజ్ఞ ఫలాలైన నిధులున్నాయి. ఇవి ఎవ్వరివీ కాదు. ఇకనుంచి నీవే. వాటిని తవ్వి తీసుకో”. అయోమయంగా చూస్తున్న బ్రాహ్మణుడిపై జాలి కలిగి వృక్ష దేవత “నిధిని తవ్వితీయటం నీకు కష్టం. రాత్రికి నేనే నీ ఇంటికి వచ్చి ధనం ఇస్తాను” అని తన తపోఫలంతో ఆ బ్రాహ్మణుడికి ఆ ధనాన్ని ఇచ్చింది వృక్ష దేవత.

కథ ముగిస్తూ శాస్త్ర చెప్పాడు “ఆ కాలంలో బ్రాహ్మణుడు ఆనందుడు, వృక్ష దేవతను నేనే”.(Buddha)

Read : https://vaartha.com/category/sunday-magazine/

Read also : Gautama Buddha : జ్ఞానులకి జ్ఞాని – బుద్ధుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870