ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త బ్రాడ్‌బ్యాండ్ Wi-Fi వినియోగదారుల కోసం పరిమిత కాలం పాటు ఫ్లాష్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Also: ISRO: ఈనెల 21న బ్లూబర్డ్-6 ఉపగ్రహం ప్రయోగం
సాధారణంగా రూ.499 ప్లాన్..
ఈ ప్రమోషన్ కింద సాధారణంగా నెలకు రూ.499 ఉండే BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కొత్త కస్టమర్లు నెలకు కేవలం రూ.399కే పొందవచ్చు. ఈ తగ్గింపు మొదటి మూడు నెలల వరకే వర్తిస్తుంది. దీంతో మొత్తం రూ.300 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మూడు నెలల అనంతరం ప్లాన్ తిరిగి సాధారణ ధరకు మారుతుంది.
ప్లాన్ ఫీచర్లు ఇవే
ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో వినియోగదారులకు నెలకు 3300GB డేటా అందుతుంది. ఇంటర్నెట్ వేగం గరిష్టంగా 60 Mbps వరకు ఉంటుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) పూర్తయ్యాక కూడా తగిన వేగంతో అపరిమిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. స్ట్రీమింగ్, వర్క్ ఫ్రం హోమ్, రోజువారీ వినియోగానికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
సిల్వర్ జూబ్లీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో మరిన్ని లాభాలు
25 ఏళ్ల సేవలను గుర్తుచేసుకుంటూ BSNL సిల్వర్ జూబ్లీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా ప్రమోట్ చేస్తోంది. ఈ ప్లాన్ నెలకు రూ.625కి అందుబాటులో ఉండి, 75 Mbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. అదనంగా 600కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 127 ప్రీమియం ఛానెల్స్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్ వంటి ప్రముఖ OTT యాప్‌లను అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు.ఈ ప్లాన్ వేగం, వినోదం రెండింటినీ ఒకేసారి కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: