📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Telugu News: BRS: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన బీఆర్ఎస్

Author Icon By Sushmitha
Updated: September 26, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నారంటూ ఈ రోజు ఉదయం నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ వెంటనే స్పందించింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి కొందరు ఫేక్ వార్తలు(Fake news) పుట్టిస్తున్నారని ప్రకటించింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.

 Navaratri Fasting: పాటించవలసిన మరియు తప్పించవలసిన నియమాలు

బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు తెలిపారు. నేడు ఎర్రవల్లిలోని తన నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారని పార్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా వారు సమావేశమైన వీడియో కూడా బయటకు వచ్చింది. మీడియా సంస్థలు వాస్తవాల ఆధారంగా మాత్రమే వార్తలు ప్రసారం చేయాలని బీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది.

ఫామ్ హౌస్‌కే పరిమితం, తరచూ వార్తలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎక్కువగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోనే(Farm house) ఉంటున్నారు. మధ్యలో కాలు విరిగినప్పుడు కొద్ది రోజులు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ముఖ్య నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేకసార్లు ఆయన ఆరోగ్యంపై వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ రోజు ఉదయం కూడా కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు రావడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అయింది.

జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన

ఈ రోజు బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేస్తూ కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆయన సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యూహాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై బీఆర్‌ఎస్ స్పందన ఏమిటి?

ఆ వార్తలు ఫేక్ అని, కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని బీఆర్‌ఎస్ ప్రకటించింది.

కేసీఆర్ ఈరోజు ఎక్కడ, ఎవరితో సమావేశమయ్యారు?

ఎర్రవల్లి నివాసంలో కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

brs Google News in Telugu Harish Rao. health rumors KCR ktr Latest News in Telugu Political News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.