భారతదేశంలోని ప్రముఖ క్రాఫ్ట్ బీరు తయారీ సంస్థ బీరా (Bira 91) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు దేశ ఈరు మార్కెట్లో ట్రెండ్ సెటర్ గా నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి చేరింది. అనేకమంది ఉద్యోగులు కంపెనీ గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. Bira 91 మాతృసంస్థ బి9 బెవరేజెస్ లిమిటెడ్ లోని 250మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులకు లేఖ రాశారు.
Read Also: Srikakulam:హృదయ విదారక దృశ్యాలు.. తొక్కిసలాట ఘటన
సీఈవో రాజీనామాకు డిమాండ్
నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, పన్ను మినహాయింపులు చేసిన జమ చేయకపోవడం, పీఎఫ్, గ్రాట్యుటీ చెల్లింపులు జరగకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. దీంతో సంస్థ వ్యవస్థాపకుడు సిఈవో అంకుర్ జైన్ రాజీనామా చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారు ఈ సంక్షోభాన్ని కేవలం డబ్బు సమస్యగా కాకుండా, నమ్మక సంక్షోభంగా వర్ణిస్తున్నారు. బీరా 91 యాజమాన్యంలోని ది బీర్ కేఫ్(The Beer Cafe) అనే ప్రముఖ పబ్ చైన్ ను పెట్టు బడిదారులు స్వాధీనం చేసుకోవడం. దీనికి ప్రధాన కారణం బీరా 91 ఆ వ్యాపారంపై తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోవడం. ప్రస్తుతం ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతోంది.
బి9 బెవరేజెస్ తన పేరును 2023 చివరలో ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లిమిటెడ్గా మార్చుకుంది. మద్యం రంగంలో కంపెనీ పేరు మారినప్పుడు మద్యం లైసెన్సులు తిరిగి దరఖాస్తు చేయాల్సి వస్తుంది. ఈ అనుమతులు నెలల తరబడి లభించకపోవడంతో కంపెనీ ఉత్పత్తి చేసిన బీరు అమ్మలేని పరిస్థితి. దాదాను రూ.80 కోట్ల విలువైన బీరు స్టాక్ గిడ్డంగులలో నిలిచిపోయింది. దీనివల్ల వ్యాపారం కుదేలయింది. 2024లో రూ. 638 కోట్ల ఆదాయం కోల్పోయింది. ప్రస్తుతం మొత్తం నష్టాలు రూ.1,900 కోట్లకు పడిపోయింది. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: