Tariffs : దేశంలో మొబైల్ సేవలు అందిస్తున్న ప్రముఖ టెలికం సంస్థలు త్వరలోనే టారిఫ్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ ఎడ్జ్ రేటింగ్స్’ (CareEdge Ratings) ప్రతిపాదనలను వెల్లడించింది. వినియోగదారుల సంఖ్య (సబ్‌స్క్రైబర్ బేస్) రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో, ప్రతి వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU – Average Revenue Per User) కనీసం 10 శాతం మేర పెంచుకోవాలని టెలికం కంపెనీలు యోచిస్తున్నాయి. దీనివల్ల రీఛార్జ్ ప్లాన్ల ధరలు దాదాపు 10 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ హఠాత్తు పెంపు సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు పెద్ద షాక్‌గా మారనుంది.
Read Also : అమెరికాలో మూడు భారత ఐటీ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని సూచన!
గతంలో జరిగిన పెంపులు: నిరంతరం పెరుగుతున్న రీఛార్జ్ ప్లాన్ల ఖర్చులు
టెలికం రంగానికి చెందిన బిగ్ ప్లేయర్లు తమ మౌలిక సదుపాయాల విస్తరణ మరియు 5G సేవల నాణ్యత పెంపు పేరిట గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా టారిఫ్‌లను సవరిస్తూనే ఉన్నాయి. గతంలో 2019 డిసెంబర్‌లో టెలికం కంపెనీలు ఒకేసారి 15% నుండి 40% వరకు ప్లాన్ల ధరలను పెంచాయి. ఆ తర్వాత 2021 డిసెంబర్‌లో మరో 20% మేర టారిఫ్‌లను పెంచగా, గత జులై 2024లో కూడా 10% నుండి 25% వరకు రీఛార్జ్ రుసుములను భారం చేశాయి. ఇప్పుడు మళ్లీ కొత్తగా టారిఫ్ పెంపునకు సన్నాహాలు చేస్తుండటంతో, నెలవారీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ఖర్చులు మరింత పెరిగి వినియోగదారుల జేబులపై పెను ప్రభావం చూపనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :