📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడే వారికీ బ్యాంకుల షాక్

Author Icon By Vanipushpa
Updated: March 28, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రెడిట్ కార్డు వాడని వారు ఈ రోజుల్లో చాల అరుదు. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లోనైన, ఎలాంటి సమయంలోనైనా డబ్బు చేతిలోలేనప్పుడు క్రెడిట్ కార్డు చాల ఉపయోగపడుతుంది. అంతేకాదు వీటిని వాడేవారి సంఖ్యా కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ జనరేషన్లో ప్రతిచిన్న ప్రైవేట్ బ్యాంకుల నుండి నాన్ ఫైనాన్షియల్ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ చేస్తున్నాయి. మీకు కూడా క్రెడిట్ కార్డ్ అవసరమైతే తక్కువ పేపర్ వర్క్’తో ఇన్స్టంట్ అప్రూవల్ ద్వారా అందిస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్‌పై చేసిన ట్రాన్సక్షన్స్ ఆధారంగా గిఫ్ట్ వోచర్‌లు, క్రెడిట్ పాయింట్లు అలాగే ఇతర బెనిఫిట్స్ అందిస్తాయి, కానీ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన రూల్స్ వచ్చే నెల నుండి మారనున్నాయి.
అవును, ఏప్రిల్ 1 నుండి చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రూల్స్ అప్ డేట్ చేస్తూ మారుస్తున్నాయి. ఈ మార్పులలో అన్యువల్ ఫీజు మినహాయింపు ఇంకా ఇతర బెనిఫిట్స్ మార్పులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా SBI క్రెడిట్ కార్డ్ అండ్ SimpliClick SBI కార్డ్ వంటి ప్రముఖ కార్డులు కూడా కొత్త రూల్స్ అమలు చేస్తున్నాయి.

ఎయిర్ ఇండియా SBI క్రెడిట్ కార్డ్ మార్పులు
ఎయిర్ ఇండియా SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా SBI ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్‌లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కు 15 రివార్డ్ పాయింట్లను అందిస్తుండగా, ఇప్పుడు ఈ రివార్డ్ పాయింట్లు 5కి తగ్గించింది. అదేవిధంగా ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ప్రతి రూ.100 ఖర్చుకు కేవలం 10 పాయింట్లను మాత్రమే అందిస్తుంది, ఇంతకుముందు ఇచ్చే 30 పాయింట్ల నుండి ఇది చాలా తక్కువ. ట్రావెల్స్ బెనిఫిట్స్ పొందే SBI కో-బ్రాండెడ్ ఎయిర్ ఇండియా కార్డులపై ఆధారపడి తరచుగా ట్రావెల్ చేసే వారికి ఈ మార్పులు ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల ఎయిర్ ఇండియా SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఎయిర్ ఇండియా టికెట్ కొనుగోళ్లపై పొందే రివార్డ్ పాయింట్ల మొత్తం ఇప్పుడు తగ్గుతుంది. కాబట్టి, ఈ కార్డును ఉపయోగిస్తున్న వారు ఈ విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
IDFC ఫస్ట్ బ్యాంక్
మార్చి 31 తర్వాత కార్డులను రెన్యూవల్ చేసే వారికి IDFC ఫస్ట్ బ్యాంక్ ఒక సంవత్సరం పాటు అన్యువల్ ఫీజు మాఫీ చేస్తోంది. కానీ బెనిఫిట్స్ నిలిపివేస్తుండటంతో గతంలో ఈ కార్డును ఉపయోగిస్తున్న కస్టమర్‌లు అల్టార్నేటివ్ అప్షన్స్ పరిగణించాల్సి రావచ్చు.
సింపుల్ క్లిక్కర్ SBI కార్డ్
ఈ SBI కార్డ్ కొన్ని ట్రాన్సక్షన్స్ పై అందించే రివార్డ్ పాయింట్లను ఇప్పుడు తగ్గించనుంది. Sbi SimpleClick కార్డ్ హోల్డర్లకు Swiggyలో ఖర్చు చేసే వాటినిపై 10x రివార్డ్ పాయింట్లు ఏప్రిల్ 1 నుండి 5xకి తగ్గించనుంది. అయితే, Myntra, Book My Show అండ్ Apollo 24 వంటి ఇతర పార్ట్నర్ బ్రాండ్‌లపై 10x రివార్డ్ పాయింట్ల బెనిఫిట్స్ కొనసాగుతుంది. ఈ మార్పు Swiggyలో ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్‌లను ఎఫెక్ట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డ్
ఎయిర్ ఇండియాతో విస్తారా విలీనం తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఏప్రిల్ 18 నుండి విస్తారా క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ సవరిస్తుంది. ఈ తేదీన లేదా ఆ తర్వాత కార్డులను రెన్యూవల్ చేసేవారికి అన్యువల్ ఫీజు వసూలు చేయదు, కానీ కొన్ని వాల్యూ ఫీచర్లు తీసేయనుంది.

for credit card users Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.