📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

TALIBAN: అఫ్గానిస్థాన్‌లో చెస్‌పై నిషేధం: తాలిబన్లు

Author Icon By Shobha Rani
Updated: May 13, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ దేశంలో చెస్​ (Chess) ను బ్యాన్​ చేస్తున్నట్లు అఫ్గానిస్థాన్​లోని తాలిబన్ (Taliban) ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలుత మే 11న చెస్ గేమ్(Chess) ​ను నిలిపివేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఆ తర్వాత ఆటపై ఏకంగా బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ ఆటపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించే వరకూ చెస్ (Chess) ​పై నిషేధం కొనసాగుతుందని చెప్పింది.
సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యకలాపాలపై కఠిన ఆంక్షలు
తాలిబన్లు అఫ్గానిస్థాన్​లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తూన్నారు. ఈ నేపథ్యంలో చెస్​పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు చెస్​ను కొనసాగించాలని క్రీడా మంత్రిత్వ శాఖను కొంతమంది క్రీడాకారులు కోరారు. అయితే అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఒకప్పుడు అఫ్గానిస్థాన్​లో చెస్​ (Chess) మేధో క్రీడగా పరిగణించేవారు. ఇటీవల కాలంలో చెస్​ (Chess) ఆడేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే తాలిబన్ ప్రభుత్వం సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను పరిమితం చేయడానికే నిషేధ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

TALIBAN: అఫ్గానిస్థాన్‌లో చెస్‌పై నిషేధం: తాలిబన్లు

బాలికలకు నలుపు రంగు యూనిఫామ్ తప్పనిసరి
ఇటీవల తాలిబన్లు ప్రకటించిన కొత్త యూనిఫామ్ మార్చి 22 నుంచి విద్యార్థులు ధరించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 27న ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రకటన ప్రకారం, 1 నుంచి 9 తరగతుల విద్యార్థులు నీలిరంగు దుస్తులు, తెల్ల టోపీ ధరించాలని పేర్కొన్నారు. 10 నుంచి 12వ తరగతి విద్యార్థులు తెల్ల దుస్తులు,టోపీ లేదా తలపాగా ధరించాలని తెలిపారు.
గతంలో తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల యూనిఫామ్‌లపై నిర్ణయం తీసుకున్నారు. బాలికలకు నలుపు రంగు యూనిఫాం ఉండాలని ఆదేశించారు. యూనిఫాం విషయాన్ని పేర్కొంటూ తొమ్మిది పాయింట్ల నివేదిక రూపొందించారు. అందులో మహిళా ఉపాధ్యాయనుల యూనిఫాంకు సంబంధించిన వివరాలను చేర్చలేదు.
ఆరో తరగతి తరువాత చదువుపై నిషేధం
తాలిబన్లు (Taliban) ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై కూడా అనేక ఆంక్షలను విధించారు. వీరు అఫ్గానిస్థాన్​లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి బాలికలు ఆరో తరగతి కంటే ఎక్కువ చదువుకోకుండా నిషేధించారు. విశ్వవిద్యాలయాలు, వైద్య, విద్యా కేంద్రాలలో మహిళలు చదవకూడదని ఆజ్ఞలు జారీ చేశారు. తాలిబన్ పాలన క్రమంగా దేశంలోని ప్రజల వ్యక్తిగత, మేధో, సాంస్కృతిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. బాలికలు ఆరో తరగతి దాటి చదవకూడదని తాలిబన్లు (Taliban) నిర్ణయించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, వైద్య విద్యా సంస్థలు, విద్యా కేంద్రాలలో మహిళల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. వినోదం, క్రీడలు, విద్య, మహిళల స్వేచ్ఛ వంటి అంశాల్లో సంపూర్ణ నియంత్రణను చేపట్టారు. చెస్‌పై నిషేధం కూడా అదే వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.

Read Also: Cruise Missiles: సూపర్‌సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ క్షిపణి గురించి మీకు తెలుసా?

Ban on chess Breaking News in Telugu Google news Google News in Telugu in Afghanistan: Taliban Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.