📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Prawns: ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌

Author Icon By Vanipushpa
Updated: October 22, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం నుండి రొయ్యల దిగుమతులను బ్యాన్ చేసిన ఎనిమిది సంవత్సరాల అనంతరం, ఆస్ట్రేలియా(Australia) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి తొక్క తీయని భారతీయ రొయ్యల దిగుమతికి షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఈ నిర్ణయం భారతీయ సముద్ర ఆహార ఎగుమతి రంగానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ పరిశ్రమకు పెద్ద ఊపునివ్వనుంది. 2017 జనవరిలో కొన్ని భారత రొయ్యల(Prawns) సరుకుల్లో తెల్ల మచ్చ వైరస్‌ (White Spot Virus) గుర్తించడంతో.. ఆస్ట్రేలియా భారతదేశం నుండి తొక్క తీయని shrimp దిగుమతులను పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ఎగుమతిదారులు పెద్ద ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు.

 Read Also: Lahore: లాహోర్‌లో గాలికాలుష్యం హెచ్చరిక

Prawns

కఠినమైన నిబంధనలతో రొయ్యల దిగుమతికి అనుమతి

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సందర్భంలో ఈ సానుకూల పరిణామాన్ని ప్రకటించారు. ఆయన X (ట్విట్టర్‌) లో పోస్ట్‌ చేస్తూ, “తెల్ల మచ్చ వైరస్‌ గుర్తింపుతో పొట్టు తీయని రొయ్యలపై ఆస్ట్రేలియా విధించిన నిషేధం భారతీయ సముద్ర ఆహార ఎగుమతిదారులకు పెద్ద అడ్డంకిగా మారింది. నేడు ఆ నిషేధం ఎత్తివేయబడిం దని ఇది భారత ఆక్వాకల్చర్‌ రంగానికి ఒక ప్రధాన ముందడుగని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఈసారి మంజూరు చేసిన అనుమతి షరతులతో కూడినది. ఉత్పత్తి అయ్యే రొయ్యలు వ్యాధి రహిత మండలాల్లో సేంద్రీయంగా పండించబడాలి, అలాగే ఎగుమతి రవాణాలో తెల్ల మచ్చ వైరస్‌ లేకపోవడం నిర్ధారించాల్సిన నిబంధనలను జారీ చేసింది. దీంతో పాటుగా రొయ్యలను స్తంభింపజేసి వేరుచేయడం వంటి నిబంధనలు కూడా కొనసాగుతాయి. ఆక్లాండ్‌కు చెందిన హాస్పర్ బ్రాండ్ ల్యాబ్స్‌ అధినేత దిలీప్ మద్దుకూరి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా కొన్ని కఠినమైన నిబంధనలతో భారతదేశం నుండి రొయ్యల దిగుమతికి మళ్లీ అనుమతి ఇచ్చింది.

రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ 80 శాతం వాటా

ఇవి వ్యాధి నియంత్రణకు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సాంకేతిక మార్పులు. 2017కి ముందు ఉన్న కొన్ని పాత షరతులు అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు. భారతదేశం నుండి రొయ్యల దిగుమతుల పునరుద్ధరణ ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రాధాన్యమైనది. దేశంలో మొత్తం రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ 80 శాతం వాటా కలిగి ఉంది. అలాగే, రాష్ట్రం ఉత్పత్తి చేసే రొయ్యలలో దాదాపు 70 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు భారత రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ కాలంలో విధించిన యాంటీడంపింగ్‌ సుంకాలు 59.72 శాతం వరకు పెరగడంతో, ఆంధ్రప్రదేశ్‌ రొయ్యల ఎగుమతిదారులు అమెరికా మార్కెట్‌లో పోటీ సామర్థ్యాన్ని కోల్పోయారు.

రొయ్యలు ఆరోగ్యానికి మంచివా?
రొయ్యలు తినడం వల్ల కలిగే టాప్ 7 ఆరోగ్య ప్రయోజనాలు - బ్లాగ్
అవును, రొయ్యలు ఆరోగ్యానికి మంచివి ఎందుకంటే వాటిలో లీన్ ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు సెలీనియం, B12 మరియు జింక్ వంటి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

రొయ్య ఒక చేపనా?
రొయ్యలు మరియు రొయ్యల మధ్య తేడా ఏమిటి? | ది కిచన్
కాదు, రొయ్య ఒక చేప కాదు; ఇది ఒక క్రస్టేసియన్, ఇది ఎక్సోస్కెలిటన్ కలిగిన అకశేరుకం,

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Andhra Pradesh Aquaculture Australia Imports Indian Seafood Latest News Breaking News Prawn Export Seafood Industry Telugu News Trade Approval

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.