Asia : బాక్సింగ్ టోర్నీలో ఛాంపియన్‌గా భారత్
న్యూఢిల్లీలో నిర్వహించిన Asia జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో అండర్-15 విభాగంలో భారత బాక్సర్లు తమ ప్రతిభతో మిగిలిన దేశాలను వెనక్కి నెట్టారు. మొత్తం 25 పతకాలు గెలిచిన భారత్, 11 స్వర్ణ పతకాలు, 3 రజతాలు, 11 కాంస్య పతకాలతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.బాలికల విభాగంలో భారత బాక్సర్లు అసాధారణంగా రాణించారు. కోమల్ (33 కేజీ), ఖుషీ (35 కేజీ), తమన్నా (37 కేజీ), సువీ (40 కేజీ), మిల్కీ (43 కేజీ), ప్రిన్సీ (52 కేజీ), నవ్య (58 కేజీ), సునైనా (61 కేజీ), తృష్ణ (67 కేజీ), వనిక (70 కేజీల పైగా) బంగారు పతకాలు సాధించారు. వీరి ప్రదర్శన భారత్‌కు ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చింది.ఇక బాలుర విభాగంలో కూడా భారత్‌కు గర్వకారణమైన విజయాలు లభించాయి. సంస్కార్ వనోద్ (35 కేజీ) తన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే, రుద్రాక్ష (46 కేజీ), అభిజిత్ (61 కేజీ), లక్ష్యయ్ (64 కేజీ) ఫైనల్‌లో పోరాడినా రజత పతకాలకే పరిమితమయ్యారు.ఈ టోర్నీలో భారత బాక్సర్లు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి, పట్టుదల దేశ క్రీడా రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. యువ ప్రతిభావంతులైన ఈ బాక్సర్లు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత పతాకాన్ని పతిపించనున్నారు అనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
Read More : Sports: విడాకులు తీసుకున్న మేరీకోమ్