📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Apollo Tyres – టీమిండియాకు కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్ వచ్చాడు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టైర్ల తయారీ దిగ్గజం అపోలో టైర్స్ (Apollo Tyres) టీమిండియా అధికారిక జెర్సీ స్పాన్సర్‌గా ఎంపికైందని బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త భాగస్వామ్యం 2027 వరకు కొనసాగనుంది.

కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్, ఫాంటసీ గేమింగ్ వంటి అప్లికేషన్‌లపై పరిమితులు విధించిన తర్వాత, టీమిండియాకు గతంలో జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 (Dream11) తో బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో,డ్రీమ్11తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో అపోలో టైర్స్ ముందుకు వచ్చింది.

ఒప్పందం ద్వారా అదనపు ఆదాయం

ఈ కొత్త ఒప్పందం ద్వారా అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4.5 కోట్లు చెల్లించనుంది. గతంలో డ్రీమ్11 ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. దానితో పోలిస్తే బీసీసీఐకి ఈ ఒప్పందం ద్వారా అదనపు ఆదాయం రానుంది. భారత జట్టుకు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్‌లు ఉన్నందున,

ఈ స్పాన్సర్‌షిప్ ద్వారా అపోలో టైర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రచారం లభించనుంది. ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌లో కుదిరిన అత్యంత విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది.ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌ (Asia Cup) లో భారత పురుషుల జట్టు ఎలాంటి స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది.

మహిళల ప్రపంచకప్‌లో

అదేవిధంగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ (ODI series) లో మహిళల జట్టు జెర్సీపై కూడా స్పాన్సర్ లోగో లేదు. అయితే, సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల ప్రపంచకప్‌ (Women’s World Cup) లో కొత్త స్పాన్సర్ జెర్సీపై కనిపిస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Apollo Tyres

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్’ ప్రకారం, నిజమైన డబ్బుతో ఆడే ఆన్‌లైన్ గేమింగ్‌ (Online gaming) పై నిషేధం విధించారు. “ఏ వ్యక్తి అయినా ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలను అందించడం, ప్రోత్సహించడం, లేదా అలాంటి ఆటలు ఆడేలా ప్రేరేపించే ప్రకటనలలో పాల్గొనడం నిషిద్ధం” అని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.

ఫాంటసీ గేమింగ్ సంస్థలు

ఈ కారణంగానే డ్రీమ్11, పురుషుల ఆసియా కప్ నుంచి టైటిల్ స్పాన్సర్‌గా తప్పుకుంది. గతంలో డ్రీమ్11, మై11సర్కిల్ వంటి ఫాంటసీ గేమింగ్ సంస్థలు టీమిండియా, ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ (IPL sponsorship) ల ద్వారా బీసీసీఐకి దాదాపు రూ. 1,000 కోట్లకు పైగా ఆదాయాన్ని అందించాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ సంస్థల ఆదాయ మార్గాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఇక ఆట విషయానికొస్తే, ఆసియా కప్‌లో యూఏఈ, పాకిస్థాన్‌లపై వరుస విజయాలతో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. సెప్టెంబర్ 19న ఒమన్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు, మొహాలీలోని ముల్లన్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. సెప్టెంబర్ 17న జరిగే రెండో మ్యాచ్‌లో పుంజుకోవాలని చూస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/kuldeep-yadav-axar-patels-advice-helped-him-take-wickets/sports/548398/

apollo tyres sponsorship deal bcci agreement Breaking News dream11 contract cancelled government ban on betting apps latest news team india new jersey sponsor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.