- 10, 20, 30శాతం డిస్కౌంట్లు
- ఈ నెలాఖరు వరకూ వర్తింపు
- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
విజయవాడ : వివిధ ప్రాంతాలకు చెందిన కళారూపాలకు(AP Handlooms) మార్కెట్ కల్పించడంతో పాటు కళాకారులకు ఆర్థిక భరోసా -భించేలా లేపాక్షి షో రూమ్ ల్లో 30 శాతం వరకూ డిస్కౌంట్ అమ్మకాలు ప్రారంభించినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆయా కళారూపాలను 10, 20, 30 శాతం డిస్కౌంట్లతో అమ్మకాలు చేస్తు న్నామన్నారు. సంక్రాంతి పండగ దృష్ట్యా డిస్కౌంట్ అమ్మకాలు ప్రారంభించా మన్నారు.
Read Also: CMD Sivashankar: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
దీనివల్ల కళారూపాలను తక్కువ ధరలకే లభించడంతో పాటు అదే సమయంలో అమ్మకాలు పెరగడం వల్ల కళాకారులకు ఉపాధి(AP Handlooms) పెరిగే అవకాశ ముందని తెలిపారు. రాష్ట్రంలో మూడు లేపాక్షి షో రూమ్లను వినియోగ వారులకు ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్నామని, ఇందుకోసం ఒక్కో షో రూమ్ నకు రూ.15 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ కామర్స్ లోనూ కళారూపాలను అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో లేపాక్షి అధికారులతో మంత్రి సవిత పోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండగను వృష్టిలో పెట్టుకుని కళారూపాల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకోవా అన్నారు. ఆయా కళారూపాలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని 10. 20 3 నలతంతో డిస్కౌంట్ అమ్మకాలేషా ఏ మేరూ్పులో ఈ నెలాఖరు మంత్రి అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి షో వరకూ జరిగే డిస్కౌంట్ అమ్మకాలపై మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
విడతల వారీగా షో రూమ్ల అభివృద్ధి
రాష్ట్రంతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో 19 లేపాక్షి షో రూమ్లు ఉన్నట్లు ఆ సంస్థ ఎండీ విశ్వ తెలిపారు. వాటిలో 16 షో రూమ్లు ఏపీలోనే ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా లేపాక్షి షో రూమ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆ నిర్మాణాలు ఉండాలన్నారు. మొదటి విడతలో విశాఖపట్నం, అనంతపురం, కడప లేపాక్షి షో రూమ్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో షో రూమ్కు రూ.15 లక్షల చొప్పున వెచ్చిస్తోందన్నారు. ఇప్పటికే చేపట్టిన ఢిల్లీలో ఉన్న లేపాక్షి షో రూమ్ అభివృద్ధి పనులు గురించి మంత్రి వాకబు చేశారు. మిగిలిన 15 షో రూమ్ లను విడతల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
ఆన్లైన్లో కళారూపాల అమ్మకాలు
చేనేత వస్త్రాలను ఈ కామర్స్ విక్రయించినట్లు లేపాక్షి కళారూపాలను ఆన్ లైన్ లో లభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. మారుతున్న పరిస్థితులతో వినియోగదారులు షాపులకు వచ్చి కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారన్నారు. నిత్యావసరాలు, వస్త్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారన్నారు. వినియోగదారుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళారూపాలను ఆన్ లైన్ లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: