📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

AP Free Transport Scheme : ఉండవల్లి గుహల వద్ద ఉచిత బస్సు సేవలు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

Author Icon By Sai Kiran
Updated: August 15, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉండవల్లి గుహల వద్ద ఉచిత (AP free transport scheme) బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబుదేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. (AP free transport scheme) ఎన్నికల వాగ్దానాల్లో కూటమి ‘సూపర్ సిక్స్’ హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది.

నేడు స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేడు అమలు చేయనున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సులో రాకపోకలు సాగించే మహిళలకు ఛార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించనున్నారు. ఇంటర్ మొదలుకొని ఉన్నత విద్య వరకూ చదువుకునే విద్యార్థినులు ఇకపై బస్ పాస్లు కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. దీంతో నిరుపేద మహిళలు, కూలీ పనులు చేసుకునే మహిళలకు ఈ పథకం వల్ల ఎంతో ఊరట లభించనున్నది.

5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు.

ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు పల్లె వెలుగు, అల్ట్రాపల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ వంటి 5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. తిరుపతి, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, ద్వారకాతిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ వంటి ప్రధాన ఆలయాలకు వెళ్లాలనుకున్నా బస్ ఛార్జీల భారం కారణంగా వెళ్లలేనివారే అధికం. ఇకపై ఇటువంటి కుటుంబాల్లో మహిళలకు బస్ఛార్జీల భారం లేకపోవడంతో తక్కువ ఖర్చుతో ఆలయాలకు వెళ్లి వచ్చేందుకు అవకాశం కలగనుంది.

AP Tourism Development Bus Service Launch by Chandrababu CM Chandrababu naidu Free Bus Service Andhra Pradesh Google News in Telugu Independence Day Andhra Pradesh Telugu News Today Undavalli Caves

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.