📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest Telugu News: POK-పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీవోకేలో నిరసనలు.. ఎందుకంటే!

Author Icon By Vanipushpa
Updated: September 30, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీవోకే (POK)లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ(AAC) నేతృత్వంలో సోమవారం పెద్ద ఎత్తున బంద్‌కు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ “షటర్-డౌన్..వీల్-జామ్” పేరుతో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ (Pakistan) ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపి వేసింది.

POK-పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీవోకేలో నిరసనలు.. ఎందుకంటే!

దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నారు
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని ప్రజలు…తమను పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. మొత్తం 38 డిమాండ్లను ఏఏసీ, పాక్ ప్రభుత్వం ముందు ఉంచింది. సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, విద్యుత్తు చార్జీల తగ్గింపు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన వాగ్దానాల అమలు వంటివి ఏఏసీ డిమాండ్లలో ఉన్నాయి. గడచిన 70 ఏళ్లుగా పీవోకే ప్రజలకు దక్కని ప్రాథమిక హక్కుల అమలు కోసమే ఆందోళన చేపడుతున్నట్లు ఏఏసీ నాయకుడు షౌకత్‌ నవాజ్‌ మీర్‌ తెలిపారు.
అవామీ యాక్షన్ కమిటీ(AAC) నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడంతో పాక్‌ ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దించింది. పీవోకేలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. ప్రాథమిక హక్కుల కోసం నిరసన చేస్తున్న పౌరులపైకి పాక్ ప్రభుత్వం కాల్పులు జరిపారని ఆందోళనకారులు ఆరోపించారు.

POK భారతదేశంలో భాగమా లేక పాకిస్తాన్‌లో భాగమా వికీపీడియా?
జమ్మూ కాశ్మీర్ దానిలో ఉన్న రెండు ప్రాంతాలైన జమ్మూ ప్రాంతం మరియు కాశ్మీర్ లోయల పేరు మీదుగా పేరు పెట్టబడింది. పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ భాగాలను భారతదేశం సమిష్టిగా "పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్" (POK) గా సూచిస్తుంది మరియు ఆజాద్ కాశ్మీర్‌కు సంబంధించిన ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా పరిగణిస్తుంది.
ఆర్టికల్ 370 మంచిదా చెడ్డదా?
నేడు, సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని నిరూపించింది. "ఆర్టికల్ 370 రద్దు తర్వాత పేదలు మరియు అణగారిన వర్గాల హక్కులు పునరుద్ధరించబడ్డాయి మరియు వేర్పాటువాదం మరియు రాళ్ళు రువ్వడం ఇప్పుడు గతానికి సంబంధించినవి అని కేంద్ర హోం మంత్రి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anti Pakistan Sentiment Economic Crisis Pakistan Human Rights in POK Latest News Breaking News Pakistan Occupied Kashmir POK Protests POK Unrest Political Crisis public protest Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.