అన్నమయ్య జిల్లా(Annamayya District) మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు తీవ్రంగా పడిపోయాయి. గత నెల వరకు కిలోకు రూ.60 వరకు పలికిన టమోటా ధరలు ప్రస్తుతం రూపాయికి కూడా కొనేవారు లేకపోవడం రైతులను కలవరానికి గురి చేస్తోంది.
Read Also:AP: నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
అధిక దిగుబడే ధరల పతనానికి కారణం
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా టమోటా సాగు జరగడంతో పాటు, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లోనూ ఈసారి దిగుబడి గణనీయంగా పెరిగింది. ఫలితంగా పెద్ద ఎత్తున సరుకు మదనపల్లి మార్కెట్‌కు(Annamayya District) చేరడంతో ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: