హైదరాబాద్ : విశాఖపట్నం (Visakhapatnam) నుంచి తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతి స్పెషల్ ట్రైన్ ఈ నెల 15 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అదే విధంగా, తిరుపతి (Tirupati) విశాఖపట్నం రైలును ఈ నెల 16 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్లు వివరించారు. ఈ మార్గంలో మొత్తం 22 సర్వీసులు నడుస్తాయి. ఇక తిరుపతి నుంచి అనకాపల్లి తిరుపతి మధ్య అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 27 వరకు మొత్తం 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి
ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Andhrapradesh
మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి
అదేవిధంగా సంబల్పూర్ (Sambalpur) ఇరోడ్ మధ్య కూడా రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. సంబల్పూర్ నుంచి ఇరోడ్ వెళ్లే రైలు సెప్టెంబరు 17 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో ఇరోడ్ సంబల్పూర్ రైలు సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 28 వరకు ప్రతి శుక్రవారం సర్వీసు అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కూడా మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
విశాఖపట్నం–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి?
A1: ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 24 వరకు నడుస్తాయి.
విశాఖపట్నం నుంచి తిరుపతి ప్రత్యేక రైలు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది?
A2: ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: