ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) (RIL)ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా నియమితులైన అనంత్ అంబానీ (Anant Ambani)వార్షిక వేతనం రూ.10-20 కోట్లుగా ఉండొచ్చని కంపెనీ వాటాదార్లకు ఇచ్చిన నోటీస్ వెల్లడిస్తోంది. ఆయన ప్రస్తుతం రిలయన్స్ ఇంధన వ్యాపారాల బాధ్యతలు చూస్తున్నారు.
రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియామకం
గ్రూప్ దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించే రిలయన్స్ (Reliance)ఫౌండేషన్ డైరెక్టరుగానూ వ్యవహరిస్తున్నారు. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటెయిల్ వెంచర్స్ బోర్డుల్లోనూ అనంత్ ఉన్నారు.
వారసత్వ ప్రణాళికలో భాగస్వామ్యం
ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన వారసత్వ ప్రణాళికలో భాగంగా ముగ్గురు పిల్లలు ఆకాశ్, ఈశా, అనంత్‌లను 2023లోనే ఆర్‌ఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించారు. ఆ హోదాలో వీరికి జీతం ఉండదు. ఇంధన వ్యాపారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా సేవలందిస్తున్నారు. జియో (Jio) ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డుల్లోనూ సభ్యులుగా ఉన్నారు.
బోర్డు భేటీలకు పరితోషికాలు
బోర్డు సమావేశాలకు హాజరైనందుకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4 లక్షల చొప్పున, లాభాలపై కమీషన్ కింద ఒక్కొక్కరికి రూ.97 లక్షలు చెల్లించారు. వీరిలో అనంత్, సంస్థ ఈడీగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమితులయ్యారు. ఈ హోదాలో జీతం, ఇతర భత్యాలు పొందుతారు.
Read Also: Stock Market: ప్రారంభంలోనే సూచీల వెనకడుగు