అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక, వాణిజ్య సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఎకానమీ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, జియోపాలిటికల్ రిస్క్‌లు ఉన్నప్పటికీ భారతదేశం తన వృద్ధి దిశను నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF – International Monetary Fund) భారత్‌కు ఒక శుభవార్త అందించింది.
Read Also: Donald Trump: ఈ నెలాఖరులో ట్రంప్, కిమ్ భేటీ?
మంగళవారం విడుదల చేసిన తన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ (World Economic Outlook)’ నివేదికలో IMF భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెంచినట్లు ప్రకటించింది. ఇది గ్లోబల్ స్థాయిలో అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ స్థానాన్ని మరింత బలపరిచింది.
భారత ఎగుమతులపై అమెరికా (America) భారీ సుంకాలను విధించినప్పటికీ, దేశీయంగా బలమైన పనితీరు కారణంగా ఈ అంచనాను సవరించినట్లు తన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్’ (World Economic Outlook’) నివేదికలో స్పష్టం చేసింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని, గత ఏడాది కాలంలో ఇదే అత్యధికమని ఐఎంఎఫ్ గుర్తు చేసింది.
ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా అదే బాటలో
ముఖ్యంగా దేశంలో ప్రైవేటు వినియోగం బలంగా ఉండటమే ఈ వృద్ధికి ఊతమిచ్చిందని తెలిపింది. ప్రభుత్వం జీఎస్టీ (GST) సంస్కరణల ద్వారా వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడంతో దేశీయ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది అమెరికా సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి సహాయపడుతుందని నివేదికలో పేర్కొంది.
ఇటీవలే ప్రపంచ బ్యాంకు సైతం భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఎంఎఫ్ (IMF – International Monetary Fund) కూడా అదే బాటలో పయనించడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను సూచిస్తోంది.ఈ సందర్భంగా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా భారత్‌పై ప్రశంసలు కురిపించారు.
మారుతున్న ప్రపంచ ఆర్థిక క్రమంలో చైనా (China) వృద్ధి నెమ్మదిస్తుండగా, భారత్ ప్రపంచానికి కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా అభివృద్ధి చెందుతోందని ఆమె కొనియాడారు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా గడ్డు పరిస్థితుల నుంచి బయటపడలేదని, రాబోయే రోజుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. వర్ధమాన దేశాల వృద్ధి రేటు 2026 నాటికి 4 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: